Begin typing your search above and press return to search.

ఇరువార్ రోజుల్ని గుర్తు చేస్తున్న ఐశ్వ‌ర్యారాయ్

By:  Tupaki Desk   |   30 July 2021 5:23 AM GMT
ఇరువార్ రోజుల్ని గుర్తు చేస్తున్న ఐశ్వ‌ర్యారాయ్
X
ద‌ర్శ‌క‌మ‌ణి మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఇరువార్ (తెలుగులో ఇద్ద‌రు) చిత్రంతో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది ఐశ్వ‌ర్యారాయ్. మ‌ణి స‌ర్ గొప్ప ఫామ్ లో ఉన్న‌ప్పుడు తెర‌కెక్కించిన ఈ సినిమా నాటి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌కు ప్ర‌తిబింబంగా నిలిచింది. క‌రుణానిధి.. ఎంజీఆర్ వంటి ప్ర‌ముఖులు వారి భార్యామ‌ణుల పాత్ర‌ల‌తో `ఇద్ద‌రు` చిత్రాన్ని ఎంతో క‌వితాత్మ‌క ఎలివేష‌న్ తో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించారు. మోహ‌న్ లాల్ - ప్ర‌కాష్ రాజ్ లాంటి ప్ర‌ముఖ న‌టుల‌తో క‌లిసి ఐశ్వ‌ర్యారాయ్ ఎంతో అద్భుత‌మైన న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. నాటి రోజులు ఐష్ కి ఎప్ప‌టికీ మెమ‌ర‌బుల్ అనే చెప్పాలి.

త‌న కెరీర్ లో మ‌ణిర‌త్నం తో ఏ అవ‌కాశం వ‌చ్చినా ఐష్‌ విడిచిపెట్ట‌లేదు. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్ లో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంత‌కాలం త‌ర్వాత కూడా త‌న గురువు మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ ని ఆమె కాద‌న‌లేక‌పోయిందంటే త‌మ అనుబంధాన్ని అర్థం చేసుకోవాలి. ప్ర‌స్తుతం ఐష్‌ పుదుచ్చేరిలో పొన్నియ‌న్ సెల్వన్ షూటింగ్ లో బిజీగా ఉంది. స్పాట్ నుంచి ఓ ఫోటోగ్రాఫ్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఐష్‌ ఇటీవల ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తన సోషల్ మీడియా హ్యాండిల్ లో త‌న త్రోబాక్ ఫోటోను పంచుకున్నారు. డబ్బూ రత్నాని యొక్క 2021 క్యాలెండర్ కోసం చిత్రీకరించిన ఫోటో ఇది. ఈ ఫోటోని షేర్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``మీరు లోపల కాంతిని కలిగి ఉన్నప్పుడు.. దానిని బాహ్యంగా చూస్తారు`` అంటూ ల‌వ్ ఫైర్ ఈమోజీల‌ను షేర్ చేసారు. ఈ ఫోటోకు అభిమానులు అంతే ఇదిగా స్పందిస్తున్నారు. మామ్ ఐశ్వ‌ర్యారాయ్ ఇరువార్ రోజుల‌ను గుర్తు చేస్తున్నారు. రేడియంట్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అంటూ పొగిడేస్తున్నారు. నిజానికి ఐష్ అందం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. 1997లో ఈ చిత్రం రిలీజైంది. అంటే దాదాపు 24 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. త‌న కెరీర్ పాతికేళ్ల జ‌ర్నీని ఐష్ పూర్తి చేసుకోబోతోంది. ఇది అసాధార‌ణ‌మైన ప్ర‌యాణం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆరాధ్య‌కు మామ్ అయినా ఇంకా ఐష్ లో అంద‌చందాలు నాటి రోజుల్ని త‌ల‌పిస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి.

డ‌బు క్యాలెండర్ ఫోటోలో ఐష్‌ బ్లేజర్ ధ‌రించి కెమెరా వైపు సూటిగా చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. త‌న‌దైన అందం అలంకరణతో ఐష్ ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. అల్ట్రా మోడ్ర‌న్ సూట్ .. ధ‌రించి అలా కురుల‌ను విర‌బోసి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నారు. ఐష్ ఈ పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే ఫ్యాష‌న్ డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా వ్యాఖ్యల విభాగంలో హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేశారు.

క్లాసిక్ హిట్ మూవీ `హమ్ దిల్ దే చుకే సనమ్` చిత్రం 22 సంవత్సరాలు పూర్తి కావడంతో ఐశ్వర్య ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్- అజయ్ దేవ్ గన్ తదితరులు నటించారు. ద‌ర్శ‌క‌నిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో ఐశ్వ‌ర్య‌ క‌లిసి ఆన్ లొకేష‌న్ హిడెన్ ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. నాటి ప్రేమను గుర్తు చేస్తున్నాను ... కానీ నా ప్రియమైన సంజయ్ ... ఇది మ‌ర‌చిపోలేనిది! అని ఐష్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులందరికీ మరియు నా శ్రేయోభిలాషుల కుటుంబానికి ... మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు ... ఎల్లప్పుడూ చాలా ప్రేమించండి అంటూ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేశారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2022లో రిలీజ్ కానుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పుదుచ్చేరిలో `పొన్నియిన్ సెల్వన్` చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది.