Begin typing your search above and press return to search.
అమీ తుమీ అనే నలుగురూ దర్శకులే
By: Tupaki Desk | 26 May 2017 9:44 AM GMTఅమీ తుమీ అంటూ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు దర్శకుడు. నానితో జెంటిల్మన్ వంటి హిట్ కొట్టిన తర్వాత.. ఇంద్రగంటి నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
అయితే.. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు పోషిస్తున్న మేల్ యాక్టర్స్ నలుగురు. శ్రీనివాస్ అవసరాల.. వెన్నెల కిషోర్.. తనికెళ్ల భరణి.. అడివి శేష్ లు అమీతుమీలో లీడ్ రోల్స్ చేశారు. ఈ నలుగురు దర్శకులే కావడమే అసలు విశేషం. శ్రీనివాస్ అవసరాల ఇప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించేసుకున్నాడు. వెన్నెల 1 1/2.. జఫ్పా చిత్రాలను డైరెక్ట్ చేశాడు వెన్నెల కిషోర్. తనికెళ్ల భరణి రైటర్ అండ్ డైరెక్టర్ గా సత్తా చాటుకున్నాడు. అడివి శేష్ కెరీర్ మొదలైందే దర్శకుడిగా కావడం విశేషం. ఇలా నలుగురు దర్శకులను ఒకే సినిమాలో నటింపచేస్తూ.. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఓ అరుదైన ఫీట్ క్రియేట్ చేస్తున్నాడు.
నిజానికి ఈ నలుగురిని తీసుకున్నపుడు ఇంద్రగంటి ఈ విషయాన్ని గుర్తించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఈ సంగతిని పట్టేసి ప్రచారం చేస్తోంది. నిజానికి ఇప్పుడిదే అసలు సమస్య అవుతుందన్నది చాలామంది పాయింట్. అందరూ డైరెక్షన్ ట్యాలెంట్ ఉన్న వారే కావడంతో.. ఎవరి యాంగిల్ లో వాళ్లు తమ ప్రతిభ చూపించేస్తే చివరకు సినిమా ఎలా ఉంటుందనే డౌట్ చాలా మందిలో మొదలైపోయింది. మరి ఇంద్రగంటి ఇంతమందిని ఎలా మెయింటెయిన్ చేశాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/