Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఆ నాలుగు ఫ్యామిలీల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..!

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:30 PM GMT
టాలీవుడ్ లో ఆ నాలుగు ఫ్యామిలీల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..!
X
టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు రాణిస్తున్నా.. ప్రధానంగా నాలుగు సినీ ఫ్యామిలీల గురించే ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. అవే నందమూరి - అక్కినేని - దగ్గుబాటి - మెగా కుటుంబాలు. ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో తమ ఆధిక్యతను చూపించుకోడానికి కృషి చేస్తూ తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకోగలిగారు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆరాధించే అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నారు.

మెగా ఫ్యామిలీలో దాదాపు డజను మంది హీరోలు ఉన్నారు కాబట్టి.. ఏడాది పొడవునా వాళ్ళ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి.. సహజంగానే మిగతా వారి కంటే వాళ్ళ డామినేషన్ కాస్త ఎక్కువ ఉంటుంది. నందమూరి హీరోలు కూడా 'మెగా' కి పోటీ ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక దగ్గుబాటి - అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

స్వయంకృషితో ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో అనేకమంది హీరోలు వచ్చారు. మెగా బ్రాండ్ తో వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డారు. ఇటీవలే 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని రిలీజ్ చేసిన చిరు.. ప్రస్తుతం 'భోళా శంకర్' 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేసి ఉన్నారు.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఇవి కాకుండా పవన్ మరో రెండు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. RRR చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి - నార్తన్ వంటి దర్శకులను చెర్రీ లైన్ లో పెట్టారు.

మెగా ఫ్యామిలీలో అంతర్భాగంగా వస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు 'అల్లు' బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. 'పుష్ప: ది రైజ్: చిత్రంతో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన బన్నీ.. 'పుష్ప: ది రూల్' తో రూల్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దీని తర్వాత పలువురు క్రేజీ డైరెక్టర్లతో జత కట్టే అవకాశం ఉంది. అతని సోదరుడు అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. అలానే సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ నిర్మించే VT13 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. మెగా మేనల్లుళ్లు సాయి తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరూ ప్రెజెంట్ చెరొక సినిమాలో నటిస్తున్నారు.. మరికొన్ని ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పారు.

ఇలా మెగా ఫ్యామిలీలో హీరోలంతా చేతి నిండా సినిమాలతో బిజీగా వున్నారు. అయితే ఇటీవల కాలంలో వారి సక్సెస్ రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనిపిస్తోంది. 'ఆచార్య' సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' తో బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' & 'భీమ్లా నాయక్' చిత్రాలు హిట్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ కాలేదు. 'ఎఫ్ 3' తో పర్వాలేదనిపించిన వరుణ్ తేజ్.. 'గని' సినిమాతో భారీ ప్లాప్ అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' 'రంగ రంగ వైభవంగా' వంటి బ్యాక్ టూ బ్యాక్ రెండు పెద్ద పరాజయాలు చవిచూశాడు. సాయి తేజ్ చివరి సినిమా కూడా ప్లాప్ లిస్టులో చేరింది.

ఇక నందమూరి హీరోలలో నటసింహం బాలకృష్ణ తన తండ్రి తారకరామారావు లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత 'అఖండ' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ జోష్ లో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలానే అనిల్ రావిపూడి తో NBK108 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ కమిట్ అయ్యారు.

గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ తో NTR31 మూవీ.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టుకున్నారు.

సరైన సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇటీవల 'బింబిసార' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో చేస్తున్న సినిమా చివరి దశకు చేరుకోగా.. 'డెవిల్' మరియు కేవీ గుహన్ ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి. 'బింబిసార 2' కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.

నందమూరి హీరోలు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోవడానికి ప్రణాళికలు వేసుకున్నారు. కరోనా పాండమిక్ తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ అయింది నందమూరి హీరోలనే చెప్పాలి. అది కూడా టాలీవుడ్ లో సందడి లేని టైంలో హిట్లు కొట్టి బాక్సాఫీస్ కు ఊపిరి పోశారనడంలో సందేహం లేదు.

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఆయన లెగసీని కింగ్ నాగార్జున ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో నాగ్ తన రేంజ్ కు తగ్గ హిట్లు అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' తో తనయుడితో కలిసి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఇటీవల 'ది ఘోస్ట్' సినిమాతో నిరాశ పరిచాడు. త్వరలో మోహన్ రాజా దర్శకత్వంలో చిన్న కొడుకు అఖిల్ తో కలిసి ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇది నాగ్ కెరీర్ లో మైలురాయి 100వ సినిమా కావొచ్చు.

యువ సామ్రాట్ నాగచైతన్య 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడని అనుకుంటుండగా.. 'థాంక్యూ' సినిమాతో అతి పెద్ద ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత పరశురాం పెట్లా - తరుణ్ భాస్కర్ లతో సినిమాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో 'దూత' అనే వెబ్ సిరీస్ తో పలకరించనున్నారు.

ఎన్నాళ్ళుగానో సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్ అక్కినేని గతేడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తో 'ఏజెంట్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీకే చెందిన సుమంత్ మరియు సుశాంత్ ఇద్దరూ ఓవైపు హీరోగా చేస్తూ.. మరోవైపు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. హిట్లు కొడుతున్నా.. అక్కినేని హీరోలు రేసులో కాస్త వెనుకబడే ఉంటున్నారు.

దగ్గుబాటి ఫ్యామిలీలో విక్టరీ వెంకటేష్ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ మధ్య 'ఎఫ్ 3' చిత్రంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. కాకపోతే ఈ గ్యాప్ లో తన అన్న కొడుకు రానా తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు.

ఇక రానా దగ్గుబాటి నటించిన 'అరణ్య' 'విరాటపర్వం' సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. 'భీమ్లా నాయక్' లో పవన్ కళ్యాణ్ కు పోటీగా నటించి మెప్పించారు. కానీ రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా తెలియలేదు. రానా తమ్ముడు అభిరామ్ 'అహింస' అనే సినిమా ద్వారా దర్శకుడు తేజ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అవుతున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.