Begin typing your search above and press return to search.
మార్చ్ 4న కూడా సినిమాల సందడే
By: Tupaki Desk | 24 Feb 2016 3:46 AM GMTఇప్పటికే ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 26 ఫుల్లుగా బుక్ అయిపోయింది. ఎనిమిది చిన్న బడ్జెట్ చిత్రాలు క్యూ కట్టేశాయి. ఇక ఈ వారం ఫుల్లుగా బ్లాక్ అయిపోవడంతో.. నిర్మాత దృష్టి మరుసటి వారంపై పడింది. వచ్చే వారం కూడా.. ఈ వారానికి ఏ మాత్రం తీసిపోకుండా మూవీస్ వచ్చేస్తున్నాయి. కాకపోతే ఈ వారం ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాల సంఖ్య రెండు. క్షణం - పడేశావే.. అంతే. కానీ మార్చ్ 4కి మాత్రం కాంపిటీషన్ టఫ్ గానే ఉంది.
మార్చ్ 4న విడుదల అంటూ ఇప్పుడు నాలుగు సినిమాలు రిలీజ్ కి సెట్ అయ్యాయి. మంచు మనోజ్ - రెజీనా జంటగా నటించిన శౌర్య - నారా రోహిత్ మూవీ తుంటరి - నందినీ రెడ్డి తీసిన కళ్యాణ వైభోగమే - ప్రవీణ్ సత్తారు మూవీ గుంటూరు టాకీస్ కూడా అదే రోజున వస్తున్నాయి. దశరథ్ దర్శకత్వంలో వస్తున్న శౌర్య ఓ థ్రిల్లర్. మాస్ ఎలిమెంట్స్ ఉన్న కామెడీ మూవీ తుంటరి. క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన సినిమా కళ్యాణ వైభోగమే. ఇక పక్కా ఊర మాస్ మూవీ గుంటూరు టాకీస్. ఇవీ ఈ నాలుగు సినిమాల జోనర్లు.
అన్నీ దేనికవే డిఫరెంట్ కాబట్టి.. ఇక్కడ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. భారీగా రిలీజ్ కానుండడంతో శౌర్యకి అడ్వాంటేజ్ ఉంటుంది. నారో రోహిత్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయనే క్రేజ్ ఉంది. నందినీ రెడ్డి డైరెక్షన్ కి మంచి డిమాండ్ ఉంది. ప్రవీణ్ సత్తారు ట్యాలెంటెడ్ డైరెక్టర్. సో.. ఏది బెస్ట్ అనే విషయాన్ని ఆడియన్సే డిసైడ్ చేయాలి.