Begin typing your search above and press return to search.

అక్కడా..ఇక్కడా.. నాలుగే

By:  Tupaki Desk   |   5 Jan 2018 12:30 AM GMT
అక్కడా..ఇక్కడా.. నాలుగే
X
ఏదైనా పండగలు వస్తున్నాయంటే చాలు ఇండియాలో సినిమా థియేటర్స్ వద్ద చాలా సందడిగా ఉంటుంది. అయితే కొన్ని పండగలు మాత్రం పలు రాష్ట్రాల్లో చాలా స్పెషల్ అని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ లో సంక్రాంతి చాలా పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో పొంగల్ ఫెస్టివల్స్ చాలా ఘనంగా జరుగుతాయి. తమిళనాడులో డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా సినిమాలు కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతాయి.

తెలుగులో నాలుగు సినిమాలు మెయిన్ గా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి - జై సింహా అలాగే గ్యాంగ్ తో పాటు రాజ్ తరుణ్ రంగుల రాట్నం సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ నాలుగు తెలుగు సినిమాలు దేనికవే ప్రత్యేకం. అయితే సూర్యా గ్యాంగ్ ఒక్కటి డబ్బింగ్ సినిమా. ఈ మూవీ తమిళ్ లో కూడా రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ టాలీవుడ్ సేమ్ టు సేమ్ అనేలా పోరు నడుస్తోంది.

అక్కడ కూడా నాలుగు సినిమాలే పొంగల్ ఫెస్టివల్ బరిలో నిలవబోతున్నాయి. సూర్యా - (గ్యాంగ్) తానా సెర్నద కూటం. చియాన్ విక్రమ్ - స్కెచ్ అలాగే ప్రభు దేవా - గుళేభగవలి. అరవింద్ స్వామి భాస్కర్ - ఓరు రాస్కేల్ సినిమాలు విభిన్న కథాంశాలతో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సారి టాలీవుడ్ కోలీవుడ్ మార్కెట్స్ లలో ఎవరు ముందుంటారో చూడాలి.