Begin typing your search above and press return to search.

నవంబర్ 3 కోసం వేయిటింగ్

By:  Tupaki Desk   |   4 Oct 2017 8:19 AM GMT
నవంబర్ 3 కోసం వేయిటింగ్
X
చిరంజీవి మొదలుకొని జూనియర్ యన్టీఆర్ వరుకు ఈ ఏడాది పెద్ద హీరోలంతా వారి సినిమాలను దసరా లోపే ప్రేక్షకుల ముందుకి తెచ్చేశారు. ఇక ఈ బ్యాచ్ లో పెండింగ్ ఉన్న నాగార్జున - రవితేజ కూడా దీపావళిని టార్గెట్ చేస్తూ తమ సినిమాల్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ తరువాత వచ్చే నవంబర్ - డిసెంబర్ లో చిన్న హీరోలు - మీడియం రేంజ్ హీరోలకి స్పేస్ దొరికింది. దాదాపు రెండు నెలలు గ్యాప్ ఉన్నా కంగారు కొద్దీ నవంబర్ మొదటి శుక్రవారాన్నే ఎక్కువ మంది తమ విడుదల తేదీగా ఎంచుకోవడం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది.

నవంబర్ 3న ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. చాలా రోజులుగా వెయిటింగ్ లో ఉన్న సోషియో ఫాంటసీ మూవీ ఏంజెల్ విడుదల తేదీని నవంబర్ 3గా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఇక వి 4 మూవీస్ పతాకం పై తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమా కూడా ఇదే తేదిన విడుదల అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని బుల్లితెర నటుడు ప్రభాకర్ డైరెక్ట్ చేశాడు. ఆది హీరోగా తెరకెక్కిన ఈ సినిమా హారర్ జానర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సందీప్ కిషన్ - మెహరిన్ జంటగా రూపొందిన కేరాఫ్ సూర్య కూడా నవంబర్ 3న విడుదల కాబోతుందని సినీ జనాలు అంటున్నారు. వీటితో పాటు అక్టోబర్ చివరి వారంలో విడుదల కావాల్సిన రామ్ ఉన్నదే ఒకటే జిందగీ వాయిదా పడి నవంబర్ 3న వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో నవంబర్ 3కి ప్రస్తుతం డిస్ట్రీ బ్యూషన్ వర్గాల్లో బాగా డిమాండ్ పెరిగింది. సినిమాను విడుదల చేస్తున్న నలుగురు నిర్మాతలకి ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉండటంతో ఎవరికి వారు తమ సినిమాలకి ఎక్కువ థియేటర్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ చిన్న సినిమాల సమరంలో ఎవరు గెలుస్తారో చూడాలి.