Begin typing your search above and press return to search.
చాలా ఏళ్ల తర్వాత ఈ మాట వింటున్నాం
By: Tupaki Desk | 27 Jun 2022 6:33 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు అవ్వబోతుంది. ఈమద్య కాలంలో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా మొదటి వారం అన్ని థియేటర్ల లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.. రెండో వారం కాస్త పల్చ పల్చగా ఉంటున్నారు. మూడవ వారం కు వచ్చేప్పటికి థియేటర్లు ఉంటున్నాయి.. కాని ఆ థియేటర్లలో సినిమా ఉండటం లేదు. ఒక వేళ అదే సినిమా థియేటర్ లో మూడవ వారం ఉన్నా కూడా జనాలు పల్చ పల్చగానే ఉంటున్నారు.
మొదటి వరం తర్వాత కూడా హౌస్ ఫుల్ అయ్యింది అంటే ఇప్పుడు ఆ సినిమా ను గొప్ప సినిమా అనవచ్చు. అలాంటిది మూడవ వారం మరియు నాల్గవ వారం లో కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. విక్రమ్ సినిమా తాజాగా నాల్గవ వారం కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. శని మరియు ఆది వారాల్లో చెన్నై తో పాటు తమిళనాడు లోని పలు ముఖ్య పట్టణాల్లో విక్రమ్ థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయట.
తమిళ మీడియాలో నాల్గవ వారం కూడా హౌస్ ఫుల్ అనే వార్తలు విచి చాలా సంవత్సరాలు అవుతుంది. రెండో వారం మూడవ వారం కూడా థియేటర్లలో ఉంటే ఆ సినిమా చాలా పెద్ద విజయం అనుకుంటున్న ఈ రోజుల్లో నాల్గవ వారం కూడా హౌస్ ఫుల్ వసూళ్లు నమోదు చేసి విక్రమ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన విక్రమ్ మరో వారం పాటు కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది.
కమల్ హాసన్ మరియు లోకేష్ కనగరాజ్ ల కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమా కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసి సరికొత్తగా రికార్డులను నెలకొల్పింది. ముఖ్యంగా తమిళనాట గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న బాహుబలి 2 అత్యధిక వసూళ్ల రికార్డును ఇప్పుడు కమల్ విక్రమ్ సినిమా బ్రేక్ చేసింది.
కమల్ హాసన్ కు సాలిడ్ సక్సెస్ పడక చాలా సంవత్సరాలు అవుతుంది. ఎట్టకేలకు లోకేష్ కనగరాజ్ వల్ల భారీ విజయాన్ని ఆయన దక్కించుకున్నాడు. అందుకే కమల్ విజయానందంలో మునిగి తేలుతున్నాడు. అందుకే పార్టీలు.. బహుమానాలు ఇస్తూ తనతో వర్క్ చేసిన వారిని సంతోష పర్చుతున్నాడు.
ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ లు నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. అంతే కాకుండా సినిమా లో చివర్లో సూర్య కూడా కనిపించడం వల్ల సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.