Begin typing your search above and press return to search.
థియేటర్లలో ప్రేక్షకులకు నీళ్లివ్వలేదో..
By: Tupaki Desk | 16 Sep 2015 7:30 PM GMTపైరసీలో సినిమా చూస్తే సినిమాను నమ్ముకున్న వాళ్లంతా ఏమైపోతారో అని తెగ బాధపడిపోతుంటారు సినీ జనాలు. కానీ ప్రేక్షకుడు థియేటరుకొచ్చి సినిమా చూడాలంటే ఎన్ని ఇబ్బందులన్నది ఎవరికీ పట్టదు. మల్టీప్లెక్సులో ఓ ఫ్యామిలీ సినిమా చూడాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా చమురు వదిలించుకోవాల్సిందే. టికెట్ల ఖర్చులకు ఎంతవుతుందో దాని కంటే ఇంటర్వెల్ ఖర్చే ఎక్కువుంటుంది. మల్టీప్లెక్సుల్లోకి నీళ్ల బాటిల్ అనుమతించరు. అక్కడే వాటర్ బాటిల్ ముప్పయ్యో, నలభయ్యో పెట్టి కొనుక్కోవాలి. కూల్ డ్రింకు కావాలంటే వంద రూపాయలు సమర్పించుకోవాలి. పాప్ కార్న్ కొనాలాంటే టికెట్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఈ ఖర్చుకు భయపడే జనాలు థియేటరుకు వెళ్లడం మానేస్తున్నారు.
టికెట్ మీద అంత ఖర్చు పెడుతున్న ప్రేక్షకుడికి కనీసం మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలన్న జ్నానం కూడా ఉండదు థియేటర్ల యజమానులకు. ఐతే నిబంధనల ప్రకారం ప్రేక్షకులకు శుద్ధమైన మంచి నీళ్లు అందుబాటులో ఉంచాలి. కానీ వాళ్లు పట్టించుకోరు. జనాలూ అడగరు. ఐతే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఈ విషయంలో తీవ్రంగా మండిపడింది. ప్రేక్షకులకు కనీస అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని సినిమా థియేటర్లన్నీ తప్పనిసరిగా ఉచితంగా కల్పించాల్సిందేనని ఎన్సీడీఆర్సీ తీర్పునిచ్చింది. సినిమా చూడ్డానికి వచ్చేవారిలో చిన్నారులు, ముసలివాళ్లు సహా అన్ని వయసుల వాళ్లుంటారని.. తాగునీరు లేకుండా మూడు గంటలు ఉండలేరని.. యాజమాన్యాలే వారికి ఉచిత తాగునీటి వసతి కల్పించాలని ఆదేశాలిచ్చింది. నీటి శుద్ధి యంత్రాలు, వాటర్ కూలర్లు, డిస్పోజబుల్ గ్లాసులు అందుబాటులో ఉంచాలని చెప్పింది. ఉచిత తాగునీటి వసతి లేకపోతే సేవల్లో లోపంగానే పరిగణిస్తామని.. ప్రేక్షకులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాబట్టి నెక్స్ట్ టైం సినిమాకు వెళ్లేటపుడు థియేటర్లో మంచి నీళ్లు లేకుంటే నిలదీయండి. రూల్స్ గురించి చెప్పండి. వినకపోతే కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయండి.