Begin typing your search above and press return to search.

ఇదే ఫస్ట్ టైమ్.. లాస్ట్ టైమ్ కూడా..

By:  Tupaki Desk   |   23 Jan 2018 2:30 AM GMT
ఇదే ఫస్ట్ టైమ్.. లాస్ట్ టైమ్ కూడా..
X
మన దగ్గర సినిమాను 50 కోట్లలో తీసినా దాని ధియేట్రికల్ హక్కులను 100+ కోట్లకు అమ్మినా కూడా.. ప్రమోషన్లకు మాత్రం 2 కోట్లు మాత్రమే ఖర్చుపెడతారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఊరూరా తిరిగి ప్రమోషన్ చేయరు. కేవలం ఒక స్టార్ హోటల్ కు మీడియా వారందరినీ పిలిచి.. అందరికీ అక్కడే ఇంటర్యూలు ఇస్తారు. అయితే బాలీవుడ్ లో తంతే వేరు. అక్కడ సూపర్ స్టార్లు కూడా చిన్ని చిన్ని టౌన్లకు కూడా వెళ్ళి సినిమాను ప్రమోట్ చేస్తారు. సినిమా బడ్జెట్ 100 కోట్లయితే.. ప్రమోషన్ కోసం ఒక 30 కోట్లు ఈజీగా పెట్టేస్తారు. అదే అక్కడి లెక్క.

కాని విషయం ఏంటంటే.. నిరంతరం ఏదో ఒక కాంట్రోవర్శీలో నలిగిపోయిన 'పద్మావత్' సినిమా కోసం ఏమాత్రం ప్రమోషన్లే చేయట్లేదు. ఎందుకంటే ఆ సినిమాకు ఉన్న కాంట్రోవర్శీల దృష్ట్యా.. ఎక్కడన్నా ఈ సినిమా నటీనటులను కాని టెక్నీషియన్లను కాని ప్రెస్ మీట్లో ఎటాక్ చేస్తే కష్టం కాబట్టి. దానికన్నా కూడా రోజూ ఈ సినిమాను తిడుతూ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ చాలామంది ఫ్రీ ప్రమోషన్లే చేస్తున్నారు. చివరకు హైదరాబాదులో కూడా రాజ్ పుత్స్ అంటూ ఒక బ్యాచ్ హడావుడి స్టార్ట్ చేసింది. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనె నడుమును విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా బట్టలు ఉన్నట్లు కవర్ చేయడం కూడా సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీగా తయారైంది. అలాగే సినిమా గురించి ఏ డిబేట్లో చూసినా డిస్కషన్లే. ఎవరు చూసినా ట్వీట్లు పోస్టులే. అవన్నీ బాగా కలిసొచ్చి.. ఏకంగా హైదరాబాద్ వంటి సౌత్ నగరాల్లో కూడా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చేలా బుకింగ్స్ అయిపోతున్నాయి.

అయితే ప్రతీ సినిమాకూ ఇలా ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది.. స్టార్లు రాకపోయినా ఓపెనింగులు వస్తాయి అనుకుంటే కష్టమే. ఎందుకంటే అన్ని సినిమాల్లోనూ ఈ రేంజులో వివాదాలు అయితే ఉండవు కదా. జనాలు అందరూ ఇలా ప్రతీ సినిమా విషయంలోనూ గగ్గోలు పెట్టరు కదా. కాబట్టి ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీ విషయంలో ఇదే ఫస్టు సినిమా.. ఇదే లాస్టు సినిమా అనుకోవాల్సిందే.