Begin typing your search above and press return to search.
`స్లమ్ డాగ్` బ్యూటీ హబ్బీ అసలు వివరాలు
By: Tupaki Desk | 22 Oct 2021 8:05 AM GMT`స్లమ్ డాగ్ మిలియనీర్` బ్యూటీ ఫ్రిదా పింటో ఇటీవలే నిండు గర్భిణిగా ఉన్న కొన్ని ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేవలం మాతృత్వం గురించి తప్ప ఇతర విషయాలేవి ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఫ్రిదా పింటో తన భర్త ఎవరు? అన్న వివరాలు ఎక్కడా వెల్లడించలేదు. గతంలో ఇద్దరుముగ్గురితో ప్రేమాయణాలకు మధ్యలోనే బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత కోరీ ట్రాన్ తో సహజీవనం చేస్తున్నట్లు మీడియాలో ప్రచారమైంది. కానీ వాళ్లిద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా? విడిపోయారా? అన్నదానిపై స్పష్ఠత లేదు. ఆ క్రమంలోనే ప్రిదా పెళ్లి చేసుకుందా లేదా? అంటూ పలు రకాల కథనాలు మీడియాలో హైలైట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఫ్రిదా మరోసారి సోషల్ మీడియా వేదికగా తన భర్త ఎవరు? అన్న వివరాల్ని తెలిపింది. ఏడాది క్రితం కోరి ట్రాన్ తో నా పెళ్లి అయింది. నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాను. ఏదీ రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఇద్దరం జీవితాన్ని ఆస్వాధిస్తున్నాం. మీ అందరి ఆనందం కోసం ఇప్పుడు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. గత లాక్ డౌన్ సమయంలో ఇద్దరం కాలిపోర్నియాలోని హోండా సెంటర్లో వివాహం చేసుకున్నాం. 2017 నుంచి డేటింగ్ లో ఉన్నాం.. అని ఫ్రీదా తెలిపింది. ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
మొత్తానికి సోషల్ మీడియాలో నెటి జనులు కామెంట్ల దెబ్బ ప్రిదాకి గట్టిగానే తగిలినట్లు ఉంది. అందుకే వెంటనే సీన్ లోకి వచ్చి భర్త వివరాలు..అతనితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. అలాగే మీ ఆనందం కోసం భర్త వివరాలు వెల్లడిస్తున్నాను అని అనడంలో ప్రిదా వ్యంగ్యాస్ర్తం కనిపించింది. భారతీయ మహిళగా పుట్టి..ఇక్కడి సంస్కృతి ప్రకారం భర్త లేకుండా పిల్లల వివరాలు వివరాలు ప్రకటించడం అన్నది నేరమని ఆలస్యంగా తెలిసిందే ఏమో. అందుకే పెళ్లి ఆధారాలతో సహా అమ్మడు లైన్ లోకి రాక తప్పలేదు.