Begin typing your search above and press return to search.

మరో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లికి రెడీ

By:  Tupaki Desk   |   28 Nov 2018 11:38 AM GMT
మరో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లికి రెడీ
X
ఇటీవలే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే - రణ్‌ దీర్‌ సింగ్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లో మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అయ్యింది. ఈమె ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ కూడా వివాహానికి రెడీ అయ్యాడు. వీరితో పాటు త్వరలోనే హీరోయిన్‌ ఫ్రెడా పింటో కూడా వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతోంది.

ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్న ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన పింటో గత కొంత కాలంగా కొరి ట్రాన్స్‌ తో ప్రేమలో ఉంది. అడ్వెంచర్‌ ఫొటోగ్రాఫర్‌ అయిన కొరిని పింటో పెళ్లి చేసుకోబోతుందట. చాలా కాలంగా వీరిద్దరి ప్రేమ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే వీరు పెళ్లి విషయమై స్పందించలేదు.

ప్రేమపై క్లారిటీ ఇచ్చేలా తాజాగా ప్రియుడు కొరి బర్త్‌ డే సందర్బంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. నేను ఆరాధించే వ్యక్తికి ప్రేమ పూర్వకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ చేసింది. ప్రేమ విషయంలో దాదాపుగా క్లారిటీ ఇచ్చిన పింటో త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ఈమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.