Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ ముందు త‌ల్లి అవుతుంది.. ఆ త‌ర్వాతే పెళ్లి!

By:  Tupaki Desk   |   29 Jun 2021 5:32 AM GMT
ఆ హీరోయిన్‌ ముందు త‌ల్లి అవుతుంది.. ఆ త‌ర్వాతే పెళ్లి!
X
ఇవాళ రేపు డేటింగ్ కామ‌న్ అయిపోయింది. పెళ్లిది ఏముందీ..? ఒక్కరోజులో అయిపోతుంది. లైఫ్ లో ఫన్ మిస్సైపోతుంది. అందుకే.. ఇష్టమొచ్చినంత కాలం జాలీగా గడిపిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ జనాలకు ఈ క‌ల్చ‌ర్ ఇంకా అల‌వ‌డ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. సెల‌బ్రిటీల‌ను మాత్రం పూర్తిగా ఆవ‌హించింది. డేటింగ్ అన్న‌ది లేకుండా.. జంట ఒక్క‌ట‌య్యే ప‌రిస్థితి దాదాపుగా క‌నిపించ‌ట్లేదు.

ఆ మ‌ధ్య శృతిహాస‌న్‌.. బిడ్డ‌ను క‌న్న త‌ర్వాతే పెళ్లి చేసుకుంటాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రి, ఏం జ‌రుగుతుందోగానీ.. ఇదే ప‌నిచేసిందో హీరోయిన్‌. ‘స్ల‌మ్ డాగ్ మిలియనీర్‌’తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లికాబోతోంది. అయితే.. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు.

ప్రియుడు కోరీ ట్రాన్ తో ఆమె రిలేష‌న్ షిప్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 2017 నుంచి వీరు డేటింగ్ కొన‌సాగిస్తున్నారు. అంతేకాదు.. 2019లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కైతే పెళ్లి చేసుకోలేదు. గ‌ర్భ‌వ‌తి మాత్రం అయ్యింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది ఫ్రిదా.

‘త్వ‌ర‌లోనే లిటిల్ ట్రాన్ ఈ ప్ర‌పంచంలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు’ అని రాసుకొచ్చింది. అయితే.. పెళ్లి ఎప్పుడు అనే విష‌యం మాత్రం ఇప్పటికీ చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ‘స్ల‌మ్ డాగ్’ త‌ర్వాత కెరీర్ కొనసాగించిన ఫ్రిదా.. పలు చిత్రాల్లో నటించింది. బ్రిట‌న్ వ‌ర‌ల్డ్ వార్‌-2, స్పై ప్రిన్సెస్ వంటి చిత్రాల్లో ప్ర‌స్తుతం న‌టిస్తోంది.