Begin typing your search above and press return to search.
ఐశ్వర్యారాయ్ పై ఫ్రెంచి పాఠ్యాంశం
By: Tupaki Desk | 28 Nov 2019 9:50 AM GMTమాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కీర్తి కిరీటంలో ఎన్నో మైలురాళ్లు. అందాల రాణిగా ఫ్యాషన్ ప్రపంచంలో సాధించని అవార్డ్ లేదు. ప్రతిష్ఠాత్మక కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రతియేటా ఐష్ కి అరుదైన గౌరవం దక్కుతూనే ఉంది. ఇప్పటికే పలు విదేశీ అవార్డులు అందుకున్న ఐశ్వర్యారాయ్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఫ్రెంచి దేశం నుంచి అరుదైన గౌరవం దక్కింది. `సెకండ్ హైయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఫ్రాన్స్` గౌరవాన్ని దక్కించుకున్న ఐష్ తాజాగా ఫ్రెంచి ప్రభుత్వం నుంచి మరో అరుదైన గౌరవం అందుకోనున్నారు.
ఇకపై ఫ్రెంచి దేశంలో హైస్కూల్ విద్యార్థులు ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకించి ఒక పాఠం అభ్యసించనున్నారు. భారతదేశానికి చెందిన విశ్వసుందరిగా ఐష్ సాధించిన అపూర్వ విజయాల్ని అక్కడ పాఠ్యపుస్తకంలో చేర్చడం సంచలనమైంది. ఇక ఇప్పటికే ఇంగ్లీష్ టెక్ట్స్ బుక్ కవర్ పేజీగా ఐశ్వర్యారాయ్ ముఖచిత్రాన్ని ముద్రించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐశ్వర్యారాయ్ తాజ్ మహల్ ముందు ఉన్నప్పటి ఫోటోని సేకరించి ముద్రించారని తెలుస్తోంది.
ఇక ఫ్రాన్స్ దేశంలో ఎన్నోసార్లు ఐశ్వర్యారాయ్ రాజమర్యాదలు అందుకున్నారు. కేన్స్ ఉత్సవాల ప్రత్యేక అతిధిగా ఐష్ కి అక్కడ అపార గౌరవం దక్కుతోంది. ఫ్రెంచి ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండే ఇంతకుముందు న్యూదిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐశ్వర్యారాయ్ ఫ్రెంచి అధ్యక్షుడితో బేటీ అయ్యారు. దేశవిదేశాల్లో ప్రముఖులతో ఐష్ సత్సంబంధాలు ఇంత మంచి గౌరవాన్ని గుర్తింపును తెస్తున్నాయి అనడంలో సందేహం లేదు.