Begin typing your search above and press return to search.

లార్గో వించ్ డైరెక్టర్ మరోసారి స్పందించాడే!

By:  Tupaki Desk   |   9 Jan 2020 9:26 AM GMT
లార్గో వించ్ డైరెక్టర్ మరోసారి స్పందించాడే!
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' కు కాపీ అనే సంగతి తెలిసిందే. అయితే కాపీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.. ప్రభాస్ 'సాహో' థీమ్ కూడా 'లార్గో వించ్' కథకు దగ్గరగా ఉంటుంది. ఈ విషయం పై నెటిజన్లు స్పందించడం.. 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలె ప్రతిస్పందించడం కూడా తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు.. కేసులు గట్రా వేస్తే అది తేలదని అనుకున్నారో ఏమో కానీ లీగల్ యాక్షన్ అయితే తీసుకోలేదు.


ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జెరోమ్ సాలె మన ఫ్రీమేక్ ల పై స్పందించారు. ఒక నెటిజన్ జెరోమ్ సాలె తో "మీ లార్గో వించ్ కు మరో వెర్షన్ ఈ వారంలోనే వస్తోంది #అల వైకుంఠపురములో" అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన జెరోమ్ "అద్బుతం. లార్గో కు బెస్ట్ ఫ్రీమేక్ అంటూ ఒక అవార్డు ఏర్పాటు చేద్దాం" అంటూ జవాబిచ్చారు. ఆ నెటిజన్ 'అల వైకుంఠపురములో' ప్రోమోస్ లో ఏం గమనించాడో ఏమో తెలియదు. ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ తన సినిమాను అదే పనిగా కాపీ కొడుతున్నారని ఎందుకు అనుకుంటున్నారో ఏమో.. ఇప్పటికే రెండు సార్లు జరిగింది కాబట్టి మరోసారి కూడా ఫ్రీమేక్ చేసే ఉంటారని ఫిక్స్ అయ్యారో ఏమో. అయినా ఆయనకు తెలియని విషయం ఏంటంటే లార్గో వించ్ ను తాకితే బొగ్గు అవుతున్నారు. ఈ జ్ఞానం మన మేకర్స్ కు ఎప్పుడో లభించింది. కాస్త కామన్ సెన్స్ ఉండేవారు ఎవరూ ఇప్పట్లో ఆ సినిమాను కాపీ చేసే ఆలోచన చేసే ధైర్యం చెయ్యరు.


అవన్నీ పక్కన పెడితే 'అల వైకుంఠపురములో' రిలీజ్ కాకముందే ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ ఇలా స్పందించడం సరికాదు. ఇప్పటికే బన్నీ సినిమా 'ఇంటిగుట్టు' కు ప్రేరణ అని.. 'రౌడీ అల్లుడు' అటో జానీ ఆఫీస్ ఎపిసోడ్స్ డైరెక్ట్ గా దించేశారని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నిందల నుంచి గురూజి ఎలా బయటపడతారో ఏమో అనుకుంటూ ఉంటే ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ కూడా తగుదునమ్మా అంటూ అవార్డు ఇవ్వాలని వెటకారం చేస్తున్నాడు.