Begin typing your search above and press return to search.
ఇందిరాగాంధీ హత్యపై ఆ చిత్రంలో ఏముంది?
By: Tupaki Desk | 13 Oct 2016 9:30 AM GMT1984లో భారతదేశాన్ని కుదిపేసిన ఘటన... ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య. ఆమె వెంట ఉన్న అంగరక్షకులే ఇందిరా గాంధీపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తరువాత, చోటుచేసుకున్న పరిణామాలు దేశాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. మాజీ ప్రధాని ఇందిరా మర్డర్ తరువాత చోటు చేసుకున్న కొన్ని కీలక ఘటనల ఆధారంగా ‘అక్టోబర్ 31’ అనే చిత్రం హిందీలో తెరకెక్కింది. శివాజీ లోతన్ పాటిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోహా అలీఖాన్ - వీర్ దాస్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచీ చాలా అభ్యంతరాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.
ఈ సినిమా కథాంశమే అభ్యంతరకరంగా ఉందనీ, అందుకే దీన్ని నిషేధించాలంటూ పిటిషినర్ అజయ్ కతారా ఢిల్లీ కోర్టును తాజాగా మరోసారి ఆశ్రయించారు. ఇంతకుముందు కూడా ఇదే విషయమై కోర్టును ఆశ్రయిస్తే... ఆ పిటిషన్ ను కొట్టి పారేసింది. పిటీషన్ తయారు చేసిన విధానమే బాలేదనీ - కేసు ఫైల్ చేసేముందు సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) ఉందా లేదా అనేది కూడా చూసుకోకుండా కోర్టుకు రావడం ఏంటని చీవాట్లు పెట్టింది. ఈ నెల 5న కేసును కోర్టు కొట్టి పారేస్తే... తాజాగా మరిన్ని కొత్త డాక్యుమెంట్లు - మరో కొత్త వాదనతో సినిమాను నిషేధించాలంటూ మరోసారి పిటీషనర్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు.
పదేపదే ఈ సినిమాను నిషేధించాలని పిటీషనర్ కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నట్టు..? అంతగా అభ్యంతరానికి ఆస్కారం ఉన్న సన్నివేశాలు ఆ చిత్రంలో ఏమున్నాయి..? ఇలాంటి అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి, ఈ సినిమాకు ఇంతకుముందే చాలా కట్ లు పడ్డాయి. సెన్సార్ బోర్డు వారు దాదాపు 10కి పైగానే కత్తెర్లు వేశారు. వివాదాస్పదం అవుతాయన్న అనుమానం ఉన్న సన్నివేశాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. అలాగే, డైలాగుల విషయంలో కూడా చాలా బీప్ సౌండ్లు వేశారు. కమిటీ ఒకటికి పదిసార్లు సినిమా చూసి - శల్యశోధన చేసింది. అయినాసరే, ఇప్పుడు మరో కొత్త వాదనతో మరోసారి పోరాటానికి సిద్ధమౌతున్నాడు పిటీషనర్. దేశంలోని అతిపురాతనమై ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ చిత్రం రూపొందింది అనేది పిటీషనర్ తాజా వాదన. అలాగే, దేశంలోని ఒక జాతీయస్థాయి నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా తీసినట్టుందని అభిప్రాయపడుతున్నాడు. ఇంతకీ ఆ ప్రముఖ నేత ఎవరనేది మాత్రం వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/