Begin typing your search above and press return to search.

ఫ్రైడే రిలీజెస్ ప‌రిస్థితేంటీ...ఏ మూవీ బెస్ట్‌?

By:  Tupaki Desk   |   11 Dec 2022 2:30 AM GMT
ఫ్రైడే రిలీజెస్ ప‌రిస్థితేంటీ...ఏ మూవీ బెస్ట్‌?
X
ప్ర‌తీ ఫ్రైడే బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద సినిమాల సంద‌డి లేని స‌మ‌యంలో అర‌డ‌జ‌న్ ల‌ కొద్ది చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. పెద్ద సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకోవ‌డం.. డిసెంబ‌ర్ 23న మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `ధ‌మాకా`మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవ‌డంతో చిన్నసినిమాల‌కు డిసుంబ‌ర్ సెకండ్ వీక్ అనువుగా ల‌భించింది. దీంతో అరడ‌జ‌ను చిన్ని సినిమాలు ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో క్యూ క‌ట్టేశాయి.

ఇందులో స‌త్య‌దేవ్ న‌టించిన రొమాంటిక్ డ్రామా `గుర్తుందా సీతాకాలం`, బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక‌, రాహుల్ విజ‌య్ న‌టించిన ఐదు క‌థ‌ల అంథాల‌జీ `పంచ‌తంత్రం`, వివాస్ వశిష్ట‌, ప్రియా వ‌డ్ల‌మాని, అయోషా ఖాన్‌, చైత‌న్య‌రావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ `ముఖ‌చిత్రం`. విశ్వ‌క్‌ సేన్ గెస్ట్ క్యారెక్ట‌ర్ లో న‌టించాడు. య‌ష్ పూరి, సెఫ్టీ ప‌టేల్ అనే కొత్త జంట న‌టించిన లేటెస్ట్ మూవీ `చెప్పాల‌ని వుంది`.

ఇక ఈ సినిమాల‌తో పాటు నిహాల్‌, అనంత్ నాగ్ న‌టించిన క‌న్న‌డ బ‌యోపిక్ `విజ‌యానంద్‌`, రంజిత్ సొమ్మి, సౌమ్యామీన‌న్ జంట‌గా న‌టించిన ల‌వ్ స్టోరీ `లెహ‌రాయి` వంటి డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ స్టోరీస్ తో రూపొందిన అర‌డ‌జ‌ను సినిమాలు ఈ ఫ్రైడే విడుద‌ల‌య్యాయి. స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్‌, కావ్యా శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `గుర్తుందా సీతాకాలం`, బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక‌, రాహుల్ విజ‌య్ న‌టించిన ఐదు క‌థ‌ల అంథాల‌జీ `పంచ‌తంత్రం` మిన‌హా మ‌గ‌తా సినిమాల్లో తెలిసిన ముఖాలు కానీ, న‌టీన‌టులు కానీ లేరు.

ఇక ఈ రెండు సినిమాల్లో `పంచ‌తంత్రం` మాత్రం కొంచెం ఫ‌ర‌వాలేద‌నే టాక్ ని సొంతం చేసుకుంది. స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్‌, క‌లిసి న‌టించిన రొమాంటిక్ ల‌వ్ డ్రామా `గుర్తుందా సీతాకాలం` టాక్ సోసోగా వున్నా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఆ మాత్రం వ‌సూళ్లు వ‌చ్చాయంటే తెలిసిన ముఖాలు వుండ‌టం వ‌ల్లే. ఇక మిగ‌తా సినిమాల్లో ఏ సినిమా కూడా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.

ప్రియా వ‌డ్ల‌మాని న‌టించిన `ముఖ‌చిత్రం`, పెద్ద‌గా ప‌రిచ‌యం లేని న‌టీన‌టులు న‌టించిన `చెప్పాల‌ని వుంది`, విజ‌యానంద్‌, లెహ‌రాయి డిజాస్ట‌ర్ అనిపించుకున్నాయి. ఈ వారం ఒక సినిమా టాక్ బాగుంటే వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. మ‌రో సినిమా టాక్ బాగాలేక పోయినా పేరున్న న‌టీన‌టులు వుండ‌టంతో వ‌సూళ్ల ప‌రంగా ఫ‌ర‌వాలేద‌నిపించిడం విశేషం. దీంతో ఈ ఫ్రైడే విడుద‌లైన సినిమాల్లో ఏది బెస్ట్ అని చెప్ప‌డానికి ఏమీ లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.