Begin typing your search above and press return to search.
పూరి చెప్పిన ఫ్యామిలీ ప్రెండ్ షిప్ సాధ్యమేనా?
By: Tupaki Desk | 7 Jun 2022 5:30 PM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `పూరి మ్యాజింగ్స్` పేరుతో తన యూట్యూబ్ లో జీవిత సత్యాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎన్నో అంశాలపై పూరి శైలిలో క్లాస్ లు తీసుకున్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మారిన వాళ్లు..మారుతున్న వాళ్లు..అనుసరిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. రియలైజేషన్ కి సంబంధించి పూరి సూక్తులు నిజంగా ఎంతో కనెక్ట్ అవుతుంటాయి. యూత్ ని బాగా ఆకర్షిస్తుంటాయి. అందుకే పూరికి యూత్ లో అంత పాలోయింగ్ ఉంది. తాజాగా ప్రెండ్ షిప్ గురించి..ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేసారు. ఆ వేంటో ముందుగా ఆయన మాటల్లో తెలుసుకుందాం.
``ఎదుట మనిషిని వాళ్ల తప్పుఒప్పులతో కలిసి యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి యాక్సెప్టెన్సీ స్నేహితుల మధ్య మాత్రమే ఉంటుంది. మనకున్న అన్ని రిలేషన్స్ ని ప్రెండ్ షిప్ మోడ్ లో పెట్టేయండి. అమ్మతో ప్రెండ్ షిప్ చేయండి. నాన్నతో ప్రెండ్ షిప్ చేయండి..చెల్లితో..అక్కడతో ప్రెండ్ షిప్ చేయండి. ఇలా కుటుంబంలో అందర్నీ కూడా ప్రెండ్ షిప్ మోడ్ లో కి తీసుకొచ్చేయండి.
లైఫ్ లో సగం దరిద్రాలు తగ్గుతాయి. ప్రెండ్లీగా ఉన్న తాతయ్యలతోనే మనవలు ఎక్కువగా ఆడుకుంటారు. ప్రెండ్లీగా ఉన్న తల్లి దండ్రులతోనే పిల్లలు అన్నీ ఓపెన్ గా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడుతున్నారంటే? దాని అర్ధం వాళ్లు మీకు దూరం అయిపోయారని. మళ్లీ వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని కంపార్ చేయోద్దు.
మీకుటుంబలో అందరూ మిమ్మల్ని వదిలేయోచ్చు. కానీ మీ స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. అందుకే పెళ్లాల్ని..మనవల్ని...కొడుకుల్ని అందర్నీ కట్టగట్టి స్నేహితులుగా మార్చేయండి. ఎప్పుడూ మీతోనే పడి ఉంటారు`అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. పూరి చెప్పింది కరెక్టే. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యమేనా? అన్ని రకాల ఫ్యామిలీస్ పూరి వ్యాఖ్యలతో ఏకీభవించగలరా? అంటే అందంత ఈజీ కాదు. కానీ సాధ్యమే.
కుటుంబంలో తల్లిదండ్రులతో బిడ్డలు స్నేహితులుగా మెలిగే రోజులొచ్చేసాయి. చాలా మంది కుటుంబాల్లో అవేర్ నెస్ కనిపిస్తుంది. అయితే ఇదంతా సాధ్యపడాలంటే కుటుంబంలో పరిస్థితులు కూడా అనుకూలించాలి. అవి అనుకూలించకపోతే ఇలాంటివి సాధ్యపడదు. ఓ సెక్షన్ ఫ్యామిలీస్ లో ఇప్పటికే పూరి చెప్పిన కల్చర్ ఆచరణలో ఉంది. గ్రామ స్థాయిలో ఇప్పుడిప్పుడే సాధ్యమవుతుంది.