Begin typing your search above and press return to search.
కింగ్ నాగ్ వదిలిన హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్ షిప్' ట్రైలర్..!
By: Tupaki Desk | 6 Sep 2021 5:17 PM GMTస్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ను సినీ ఇండస్ట్రీలో మొదలు పెట్టారు. హర్భజన్ సింగ్ హీరోగా ''ఫ్రెండ్ షిప్'' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. తమిళ 'బిగ్ బాస్' ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా తెలుగు ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.
''ఫ్రెండ్ షిప్'' ట్రైలర్ లో అమ్మాయిలు ఉండరని మెకానికల్ బ్రాంచ్ లో చేరిన కాలేజీ స్టూడెంట్ పాత్రలో హర్బజన్ ను చూపించారు. ఓ అమ్మాయి హత్య జరగడం.. దీనికి విశ్వ (హర్భజన్ సింగ్) తో సహా పలువురు కాలేజీ స్టూడెంట్స్ ను బాధ్యులను చేస్తూ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఈ నేపథ్యంలో జరిగే గొడవలను ఇందులో చూపించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించే సమాజ తీరును ఈ చిత్రంలో ప్రశ్నిస్తున్నారు.
'ఏ ఒక్క స్త్రీ.. మగవాడి ప్రత్యేక అవసరం కోసం సృష్టించింది కాదు.. ఆడది అంటే మనకు బాధ్యత. ఈ అందమైన విషయాన్ని మాకు నేర్పింది ఫ్రెండ్ షిప్' అనే వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అర్జున్ - హర్భజన్ ఇద్దరూ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టారు. 'ఫ్రెండ్ షిప్' ట్రైలర్ ఫన్నీ - ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. బౌలర్ గా సక్సెస్ అయిన భజ్జీ.. హీరోగా ఏ మేరకు అలరిస్తారో చూడాలి.
'ఫ్రెండ్ షిప్' చిత్రానికి జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జేపీఆర్ - స్టాలిన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డీఎం ఉదయ్ కుమార్ సంగీతం సమకూర్చగా.. సి.శాంతా కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో.. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.