Begin typing your search above and press return to search.

RRR నుండి ఈసారి ఆ ఫ్ల్యాష్‌ బ్యాక్‌ మొత్తం ఎత్తేశారు

By:  Tupaki Desk   |   14 Nov 2022 6:30 AM GMT
RRR నుండి ఈసారి ఆ ఫ్ల్యాష్‌ బ్యాక్‌ మొత్తం ఎత్తేశారు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నెట్‌ ఫ్లిక్స్ తో పాటు పలు ఓటీటీ ల్లో స్ట్రీమింగ్‌ అయ్యి ప్రపంచం మొత్తం ఈ సినిమా చుట్టేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అయ్యి అద్భుతమైన స్పందన దక్కించుకుంది.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కు దక్కని అంతర్జాతీయ మీడియా కవరేజ్ ను కూడా ఈ సినిమా దక్కించుకుంది. ఇక ఇటీవలే స్టార్‌ మా లో ఈ సినిమా టెలికాస్ట్‌ అయ్యింది. స్టార్‌ మా వారు ఆశించిన స్థాయిలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా రేటింగ్‌ దక్కించుకోలేదు. అప్పటికే థియేటర్లలో మరియు ఓటీటీ లో జనాలు చూడటం వల్ల టీవీల్లో చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

తాజాగా మరోసారి స్టార్‌ మా వారు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను టెలికాస్ట్‌ చేయడం జరిగింది. ఈసారి టెలికాస్ట్‌ చేసిన సమయంలో నిడివి చాలా తగ్గించారు. ముఖ్యంగా ఫ్ల్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్ పూర్తిగా ఎత్తివేసి టెలికాస్ట్ చేయడం జరిగింది.

సినిమా నిడివి తగ్గించడం ద్వారా ప్రేక్షకులకు బోర్ ఫీల్ కలుగకుండా చూసుకోవడంతో పాటు మరో షో ను ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా లు టీవీ లో టెలికాస్ట్‌ అయిన ప్రతి సారి ఏదో ఒక విధంగా మార్చుతూ ఉండేవారు. సినిమాను రకరకాల వర్షన్ ల్లో టీవీ ఛానల్స్ కు రాజమౌళి ఇస్తాడా లేదంటే ఆయన సినిమాలను ఎలా టెలికాస్ట్‌ చేసినా కూడా జనాలు చూస్తారనే ఉద్దేశ్యంతో ఛానల్స్ వారు ఎడిటింగ్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

సినిమాకు సంబంధించిన కీలకమైన ఫ్ల్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌ ను తొలగించడం ద్వారా ప్రేక్షకుల నుండి ఈసారి ఏమైనా పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందా అనేది చూడాలి. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కథ రెడీ అవుతుందని దర్శకుడు రాజమౌళి చెప్పిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఆ సీక్వెల్‌ ప్రారంభం అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.