Begin typing your search above and press return to search.
ఆర్‌ఆర్ఆర్ నుండి బింబిసార వరకు.. పాపే మా ప్రాణం
By: Tupaki Desk | 8 Aug 2022 11:30 PM GMTసోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీ గురించి మీమ్స్ అనేవి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఏదైనా సినిమా ప్లాప్ అయినా.. ఏదైనా సినిమా సక్సెస్ అయినా కూడా మీమ్స్ అనేవి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్రతి విషయాన్ని కూడా మీమ్స్ ద్వారా చూపిస్తూ అందరి దృష్టిని సోషల్ మీడియాలో కొందరు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఈ మీమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండస్ట్రీలో కూడా ఈ మీమ్ ఆలోచన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో హిట్ అయిన ఎక్కువ శాతం సినిమాలు ఎవరైనా ఒక పాప చుట్టూ కథలు తిరుగుతూ ఉన్నాయి. ఆ కథలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి మొదలుకుని మొన్న విడుదల అయిన బింబిసార సినిమా వరకు పలు సినిమాలు కూడా ఒక అమ్మాయి చుట్టూ కథలు తిరగడం మనం చూశాం. ఆర్ ఆర్ ఆర్ కి ముందు కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చాయి. దాంతో పాపే మా ప్రాణం అన్నట్లుగా హీరోలు కథను ముందుకు నడిపిస్తూ స్క్రీన్ ప్లే ను నడిపిస్తున్నారు.
అఖండ సినిమా లో ఒక చిన్న పాప చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా లో ఆ పాప బాలయ్య కూతురు పాత్ర అనే విషయం తెల్సిందే. ఆ పాత్ర లో సదరు పాప చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ లోని కొమురం భీమ్ పాత్ర పూర్తి గా ఒక పాప కోసం అనే విషయం తెల్సిందే. ఇక ఇటీవల విడుదల అయ్యి తమిళనాట ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న విక్రమ్ కూడా పాప చుట్టే కథ తిరుగుతుంది.
కమల్ హాసన్ అందులో తన మనవడిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కథ మెయిన్ గా ఆ చిన్న బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక బింబిసార లో కూడా ఒక పాపను అత్యంత పవర్ ఫుల్ గా చూపించారు.
కథ ఆ పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాల్లో చిన్న పిల్లలను పెట్టి.. వారి చుట్టూ కథ తిప్పడం వల్ల సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈ మీమ్ ను క్రియేట్ చేసి ఉంటారు.