Begin typing your search above and press return to search.

వ‌ర‌స ఫెయిల్యూర్లు.. అయినా హీరోగా అవ‌కాశాల‌కు లోటు లేదు!

By:  Tupaki Desk   |   24 Dec 2019 1:30 AM GMT
వ‌ర‌స ఫెయిల్యూర్లు.. అయినా హీరోగా అవ‌కాశాల‌కు లోటు లేదు!
X
ఈ మ‌ధ్య కాలంలోనే ఆది సాయి కుమార్ సినిమాలు రెండు వ‌చ్చి వెళ్లాయి. అలా వ‌చ్చాయి... ఇలా వెళ్లాయి ఆ సినిమాలు. *జోడీ* అంటూ ఒక సినిమా వ‌చ్చింది. దానికి కాస్త అటూ ఇటుగా.. ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ అంటూ మ‌రో సినిమా వ‌చ్చింది.

ఈ సినిమాలు విడుద‌ల కావ‌డంలో కూడా పెద్ద‌గా హ‌డావుడి లేదు. అలా పోస్ట‌ర్లు వేశారు, ఇలా థియేట‌ర్ల నుంచి ఆ సినిమాలు మాయం అయ్యాయి. ఇప్ప‌టికే ఆయా సినిమాలు వెబ్ స్ట్రీమింగ్ సైట్ల‌లో తేలాయి. ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ సినిమా విడుద‌ల అయిన ప‌క్షం రోజుల‌కే అమెజాన్ లో తేలిన‌ట్టుగా ఉంది. అలా ఏ మాత్రం ఊసు లేకుండా ఆది సాయికుమార్ సినిమాలు వ‌చ్చి వెళ్లిపోయాయి.

ఈ వ‌ర‌స ఫెయిల్యూర్ల‌ను ఈ హీరో పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. సినిమాలు చేస్తూ పోవ‌డ‌మే ప‌ని అని, ఏదైనా సినిమా ఫెయిల్యూర్ అయినా, ఆ రోజుకు మాత్రం అంద‌రికీ దూరంగా ఉండి.. సేద‌తీరతానంటూ ఆది ఆ మ‌ధ్య ప్ర‌క‌టించుకున్నాడు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఈ హీరోకి అవ‌కాశాల‌కు అయితే లోటు ఉన్న‌ట్టుగా లేదు. వ‌ర‌స ఫెయిల్యూర్ల‌లో కూడా ఆది అవ‌కాశాల‌ను పొందుతూ ఉన్నాడు. ఈ క్ర‌మంలో మ‌రో సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. పూరీ జ‌గ‌న్నాథ్ శిష్యుడు ఒక‌రు ఈ సినిమాకు డైరెక్ష‌న్ చేయ‌బోతున్నార‌ట‌. ఇదొక  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఆది సాయి కుమార్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సంద‌ర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు.