Begin typing your search above and press return to search.

ఫిలింఫేర్ లో చ‌ర‌ణ్.. కీర్తి ది బెస్ట్

By:  Tupaki Desk   |   22 Dec 2019 5:16 AM GMT
ఫిలింఫేర్ లో చ‌ర‌ణ్.. కీర్తి  ది బెస్ట్
X
సౌత్ నాలుగు భాష‌ల చిత్రాల‌కు ఫిలింఫేర్ పుర‌స్కారాల్ని అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి 66వ ఫిలింఫేర్ ఉత్స‌వాల్లో టాలీవుడ్ నుంచి ఉత్త‌మ న‌టుడిగా రామ్‌ చ‌ర‌ణ్ (రంగ‌స్థ‌లం).. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్ (మ‌హాన‌టి) అవార్డులు ద‌క్కించుకున్నారు. మ‌హాన‌టి ఉత్త‌మ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా జ‌గ‌ప‌తిబాబు (అర‌వింద స‌మేత‌) అవార్డును గెలుచుకున్నారు. సినిమా 24 శాఖ‌ల్లో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారికి అవార్డులు ద‌క్కాయి. 2018 సంవ‌త్స‌రం రిలీజైన‌ సినిమాల‌కు చెన్న‌య్ లో ఈ అవార్డుల్ని అందించారు.

టాలీవుడ్ అవార్డుల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే... ఉత్తమ చిత్రం - మహానటి.. ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ ‌(మహానటి).. ఉత్తమ నటుడు - రామ్‌చరణ్‌ (రంగస్థలం) .. ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ ( మహానటి).. ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి).. ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్) - రష్మిక మందన్న (గీతా గోవిందం).. ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం) ..ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత).. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం) .. ఉత్తమ మ్యూజిక్‌ అల్బమ్‌ - దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం).. ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్‌(ఎంత సక్కగున్నావే- రంగస్థలం).. ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే- గీత గోవిందం).. ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా-భాగమతి) .. పుర‌స్కారాలు దక్కించుకున్న వారి జాబితా ఇది.

2018 టాలీవుడ్ ఇండ‌స్ట్రీ హిట్ `రంగ‌స్థ‌లం`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుకుమార్ కి అవార్డ్ రాక‌పోవ‌డం అన్న‌ది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కి ఉత్తమ ద‌ర్శ‌కుడు అవార్డ్ ద‌క్కింది. అన‌సూయ (రంగ‌స్థ‌లం).. ర‌ష్మిక (గీత గోవిందం) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇక రంగ‌స్థ‌లం చిత్రానికి జాతీయ అవార్డుల్లోనూ అన్యాయం జ‌రిగింద‌న్న‌ది చ‌ర‌ణ్ అభిమానుల మాట‌.