Begin typing your search above and press return to search.
కంచరపాలెంలో అన్నీ లవ్ స్టోరీలే!
By: Tupaki Desk | 7 Sep 2018 11:50 AM GMTగత కొంతకాలంగా రియలిస్టిక్ ఎప్రోచ్ తో తీసిన సినిమా అంటూ `కేరాఫ్ కంచర పాలెం` గురించి ఊదరగొట్టేస్తున్నారు. వెంకటేష్ మహా అనే లఘుచిత్ర దర్శకుడు అమెరికా డాక్టరుతో కలిసి తీసిన ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయం అంటూ మాటా మంతీ సాగింది. పైగా న్యూయార్క్ ఫిలింఫెస్టివల్స్‌కి వెళ్లిన సినిమాగా ప్రముఖుల మన్ననలు అందుకుంది. అంతా కొత్త వారితో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి రిలీజైంది. అసలింతకీ ఈ సినిమాలో మేకర్స్ చెప్పిన రియాలిటీ ఎంత? ఇంతకీ మన ఆడియెన్‌కి ఎంతవరకూ కనెక్టవుతుంది? అని ప్రశ్నిస్తే.. కొన్ని ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించాలి.
ముందే చెప్పినట్టే ఈ సినిమాని రియలిస్టిక్ ఎప్రోచ్ లో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన మాట వాస్తవం. అన్నీ కొత్త ఫేస్‌లే. అసలు మనుషులు ఒరిజినల్‌గా ఎలా ఉంటారో అలానే చూపించారు. ప్రతి ఒక్క పేదోడి జీవితానికి కనెక్టయ్యే ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేస్తూ దర్శకుడు కథ రాసుకున్నాడు. సీన్స్ ను వాస్తవికతతో అల్లుకున్నాడు. ఇందులో నాలుగు ప్రేమకథలు సమాంతరంగా రన్ అవుతుంటాయి. స్కూల్ లవ్ స్టోరి - టీనేజీ లవ్ స్టోరి - మిడిలేజీ లవ్ స్టోరి - 50 లో లవ్ స్టోరి .. ఇవన్నీ ఒకేసారి తెరపై కనిపిస్తుంటాయి. అయితే చివర్లో ఆ ట్విస్టుని రివీల్ చేశాడు దర్శకుడు. పక్కా వైజాగ్ యాక్సెంట్ తో ఈ సినిమా తీయడం హైలైట్. రియలిస్టిక్ ఎప్రోచ్ బావున్నా.. నేటివిటీ ఆకట్టుకున్నా స్క్రీన్ ప్లే ఫార్మాట్ మరీ అంత గ్రిప్పింగ్ గా అనిపించదు. అనవసర సాగతీత చాలాచోట్ల విసుగెత్తిస్తుంది. స్లో స్క్రీన్ ప్లే .. రియలిస్టిక్ లైఫ్ టెల్లింగ్ మూవీ కావడంతో ఇది కేవలం అవార్డుల కోసం తీసినదా? అని అనిపించక మానదు. అయితే లైఫ్ లోని ఫీల్ - వాస్తవికతను చూపించిన విధానాన్ని మెచ్చుకుని తీరాలి.
వెంకటేష్ మహా కార్మికనగర్ (రెహమత్ నగర్)లో రూమ్ అద్దెకు తీసుకుని పరిశీలించిన పేదరికాన్ని - కంచరపాలెం(వైజాగ్)లో ఎనిమిది నెలలపాటు నివసించినప్పటి అనుభవాల్ని తెరపైకి తెచ్చాడని అర్థమవుతోంది. ఒక జీవితాన్ని ఉన్నదున్నట్టు చూడాలనుకునే వారికి - లైఫ్ లో పెయిన్ అనుభవించిన వారికి ఈ సినిమా నచ్చుతుంది. అలా కాకుండా ఉరకలెత్తే ఉత్సాహంతో జిగిబిగి కావాలనుకుంటే మాత్రం నిరాశే ఎదువుతుంది. ఇదో తరహా అవార్డ్ కేటగిరీ సినిమా అని చెప్పొచ్చు. ప్రథమార్థం ఓపిగ్గా చూస్తేనే ద్వితీయార్థం వరకూ వేచి చూడగలరు. చివరిలో హత్తుకునే ఫీల్ ని ఎంజాయ్ చేయగలరు. చూద్దాం.. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉండనుందో!