Begin typing your search above and press return to search.
నెక్ట్స్ జెన్ కంపోజర్లు ఎవరో!!
By: Tupaki Desk | 11 April 2017 12:30 AM GMTటాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ అన్నా సరే.. ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. మొదటి ఆప్షన్ దేవిశ్రీ ప్రసాద్ అయితే.. రెండో ఆప్షన్ ఎస్ ఎస్ థమన్. బడా సినిమాలన్నిటినీ వీళ్లే హ్యాండిల్ చేయాల్సి వస్తోంది. రెమ్యూనరేషన్ ప్రకారం చిన్న సినిమాలకు డీఎస్పీ అందుబాటులో లేడనే టాక్ కూడా ఉంది. పారితోషికం ప్రకారం మ్యూజిక్ ఉంటుందని థమన్ ఓపెన్ గానే చెప్పిసిన సందర్భం కూడా ఉంది.
అయితే.. మ్యూజిక్ లో క్వాలిటీపై ఈ మధ్య బాగానే విమర్శలు వస్తున్నాయి. వీళ్లిద్దరినీ కాకుండా.. అనూప్ రూబెన్స్ తో ట్రై చేశాడు పవన్ కళ్యాణ్. కానీ కాటమరాయుడు చిత్రానికి మెయిన్ మైనస్ పాయింట్ గా మ్యూజిక్ నిలిచింది. అటు ప్రెజర్.. ఇటు తొలిసారిగా పెద్ద స్టార్ కి మ్యూజిక్.. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని అనూప్ రీచ్ కాలేకపోయాడు. ఇప్పుడు ఇతర భాషల నుంచి సంగీత దర్శకులను దించుతున్నారు. పవన్-త్రివిక్రమ్ మూవీకి తమిళ కంపోజర్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అల్లు అర్జున్ తర్వాతి సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకద్వయం విశాల్-శేఖర్ లను దించుతున్నారు.
ఇక్కడ వీళ్లు ఉండిపోయి అనేక ప్రాజెక్టులు ఒప్పుకునే ఛాన్స్ లేదు. వారి సొంత భాషల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న కంపోజర్స్ వీళ్లు. అందుకే ఇక టాలీవుడ్ కి తర్వాతి తరం సంగీత దర్శకులను వెతుక్కోవాల్సిన ప్రోత్సహించాల్సిన సమయం దగ్గరపడిందనే విషయం తేటతెల్లమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/