Begin typing your search above and press return to search.

అన్నయ్య ఆ విషయాలన్ని గుర్తుచేశారు.. ఇంతలోనే ఇలా..!

By:  Tupaki Desk   |   21 Nov 2022 10:42 AM GMT
అన్నయ్య ఆ విషయాలన్ని గుర్తుచేశారు.. ఇంతలోనే ఇలా..!
X
సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇప్పటికీ సినీ పరిశ్రమ నమ్మలేకపోతుంది. అయన చేసిన సినిమాలు.. తెలుగు సినిమా పరిశ్రమకు వేసిన బాట గురించి ఎంత చెప్పినా తక్కువే. కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది. ఆయన అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ఎందుకు జరిపారు లాంటి విషయాల మీద కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వెళ్లడించారు. ఆదివారం అన్నయ్య దగ్గరకు వెళ్లానని.. రెండు గంటల పాటు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని అన్నారు. తనని సైకిల్ మీద సినిమాకు తీసుకెళ్లిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాం.. నవ్వుకున్నాం.. ప్రస్తుతం సినిమాల గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకున్నాం.

ఆ టైం లో కూడా అన్నయ్య అనారోగ్య లక్షణాలు ఏవి కనిపించలేదు. చాలా హుషారుగా నే కనిపించారు. తనని అక్కడే భోజనం చేయమని చెప్పినా తన ఇంట్లో వేరే వాళ్లని లంచ్ పిలవడం వల్ల మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశా.. అయితే ఆరోజు రాత్రి డిన్నర్ తర్వాత రాత్రి 12 తర్వాత అన్నయ్య కు గుండెపోటు వచ్చింది. అన్నయ్య కేర్ టేకర్ గా ఉన్న కుర్రాడు అన్నయ్య పల్స్ చెక్ చేస్తే ఎర్రర్ రావడంతో కంగారుగా తనకి కాల్ చేశాడని. వెంటనే అన్నయ్యని హాస్పిటల్ కి తీసుకురమ్మని చెప్పి తాను అక్కడకు వెళ్లానని అన్నారు.

హార్ట్ స్ట్రోక్ వచ్చిన 20 నిమిషాల లోపు హాస్పిటల్ కి చేరి వైద్యం అందితే ఫలితం ఉండేది. ఆలస్యం అవడంతో ఆ ఎఫెక్ట్ మిగతా ఆర్గాన్స్ మీద పడ్డది.. రక్త ప్రసరణ కూడా ఆగిపోయినట్టు డాక్టర్లు వెళ్లడించారు. డాక్టర్స్ అంతా దాదాపు 30 గంటల పాటు ఎంత ప్రయత్నించినా సరే అన్నయ్యని కాపాడలేకపోయారు.

రెండోసారి కూడా గుండెపోటు రావడంతో డాక్టర్లు ఏం చేయలేకపోయారని అన్నారు. అన్నయ్యనే కాదు ఓ మంచి స్నేహితుడిని కూడా కోల్పోయానని ఎమోషనల్ అయ్యారు ఆదిశేషగిరి రావు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు చేశామని అన్నయ్య ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చూసుకున్నారని అన్నారు ఆదిశేషగిరి రావు.

అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ఎందుకు చేశారంటే.. పద్మాలయ స్థలంలో కానీ.. తమ ఫాం హౌజ్ లో కానీ అంత్యక్రియలు జరిపే అవకాశం ఉన్నా అది చాలా దూరం ఉన్న కారణంగా అదీగాక అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు ఆదిశేషగిరి రావు.

గచ్చిబౌలి స్టేడియం లో అభిమానుల సందర్శనార్ధం అన్నయ్య భౌతికకాయాన్ని ఉంచాలని అనుకున్నా మంచు పడుతుండటం వల్ల అది కుదరలేదని అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చించుకునే అన్నయ్య అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించామని అన్నారు ఆదిశేషగిరి రావు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.