Begin typing your search above and press return to search.
పాత కథకు వెంకీ ఓకే చెబుతాడా?
By: Tupaki Desk | 9 Feb 2018 4:38 AM GMTనిన్నటితరం అగ్రనాయకుల్లో ఒకడైన విక్టరీ వెంకటేష్ ఈమధ్యన బాగా స్లో అయ్యాడు. ఆయన మేకప్ వేసుకుని చాలా రోజులే అయిపోయింది. గురు సినిమా తరవాత ఇంతవరకు ఏ సినిమానూ ఓకే చేయలేదు. కెరీర్ లో కీలకమైన మలుపు వద్ద ఉన్న తరుణంలో సాదాసీదా సినిమాలు చేసి అభాసుపాలయ్యే కన్నా గ్యాప్ ఇవ్వడమే మంచిదన్నట్టుగా ఉంటున్నాడు.
ఇప్పుడు వెంకీని అందరూ అడిగే ప్రశ్న ఒకటే.. నెక్ట్స్ ఏంటి? ఈ ప్రశ్నకు ఆయన నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. గురు తరవాత వెంకటేష్ కు చాలా మంది డైరెక్టర్లు చాలా స్టోరీలే చెప్పారు. కానీ ఆయన ఇంతవరకు ఏదీ ఓకే చేయలేదు. తాజాగా బొమ్మాళి అనుష్క తో భాగమతి సినిమా తీసి మరో బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అశోక్ తరవాత సినిమా వెంకటేష్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టోరీ భాగమతి కన్నా ముందే వెంకటేష్ కు వినిపించాడు. కానీ దానిపై ఆయన ఏమీ తేల్చిచెప్పలేదు. ఇప్పుడు భాగమతి హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ముందు అనుకున్న స్టోరీలో మార్పుచేర్పులు చేసి వెంకటేష్ కు వినిపించడానికి రెడీ అవుతున్నాడనేది లేటెస్ట్ న్యూస్.
రానా హీరోగా నటించిన నేనే రాజు - నేనే మంత్రి సినిమా తరవాత దానిని డైరెక్ట్ చేసిన తేజతో సినిమా చేద్దామని వెంకీ అనుకున్నాడు. తరవాత తేజ బాలకృష్ణతో ఎన్ట్టీఆర్ బయోపిక్ లో బిజీ అయిపోయాడు. మరోవైపు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అయినా పూరీయేమో కొడుకు సినిమా మెహబూబూ షూటింగ్ పనుల్లో ఉన్నాడు. సో.. ఈ టైంలో వెంకీకి కథ చెప్పి ఒప్పించగలిగితే త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేయొచ్చన్నది అశోక్ ఆలోచనగా తెలుస్తోంది. చూద్దాం.. ఈ ఐడియా ఎంతవరకు వర్కవుటవుతుందో?