Begin typing your search above and press return to search.
గాలిసంపత్ డిజిటల్ రిలీజ్ ఖరారు! విడుదలైన 8 రోజులకే..
By: Tupaki Desk | 17 March 2021 3:30 AM GMTఇటీవలే శివరాత్రి సందర్బంగా తెలుగు మూవీ గాలిసంపత్ విడుదలైంది. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ ప్రధానపాత్రలలో నటించిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. కానీ తీరా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక సినిమా బోల్తాకొట్టింది. బాక్సాఫీస్ వద్ద గాలిసంపత్ నిలబడలేకపోయింది. విడుదలైన ఫస్ట్ డే నుండే ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగా నమోదు అయ్యాయి. రెండో రోజు నుండి కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా మారింది. సినిమా కలెక్షన్స్ ప్రస్తుతం దాదాపు జీరోగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా థియేటర్లు గాలిసంపత్ షోలను కూడా రద్దు చేశాయని టాక్.
గాలిసంపత్ థియేట్రికల్ విషయాలు పక్కనపెడితే.. సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. గాలిసంపత్ డిజిటల్ హక్కులను ఆహా ఓటిటి దక్కించుకుంది. త్వరలోనే డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మేకర్స్ గాలిసంపత్ సినిమాని వీలైనంత త్వరగా ఆహా వినియోదారుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్ అలాగే ఆహా యాజమాన్యం. గాలిసంపత్ సినిమా ఆహాలో థియేట్రికల్ రిలీజైన ఎనిమిది రోజులకే అంటే.. మార్చ్ 19న ప్రసారం కాబోతుంది. మొన్నటివరకు ఏప్రిల్ నెలలో డిజిటల్ రిలీజ్ అవుతుందని వార్తలొచ్చాయి. కానీ సినిమా ఫలితం తేలిపోయేసరికి మేకర్స్ త్వరపడ్డారు. ఈ సినిమాకు ఎస్.కృష్ణ కథ అందించి నిర్మించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు. అనీష్ దర్శకత్వం వహించాడు.