Begin typing your search above and press return to search.
'గాలి సంపత్' సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది
By: Tupaki Desk | 9 March 2021 3:38 AM GMTశ్రీ విష్ణు హీరోగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో రూపొందిన వినోదాత్మక సినిమా 'గాలి సంపత్' ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనీల్ రావిపూడి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని నవ్విస్తుందని ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చారు.
పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్లుగా సెన్సార్ సర్టిఫికెట్ తో క్లారిటీ వచ్చేసింది. సినిమా లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్బుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల హీరో రామ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సినిమా కు గాను జాతీయ అవార్డు వస్తుందని ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. మాట నత్తి పోయే ఒక వ్యక్తి పడే పాట్లు ఆయన వల్ల ఇతరులు పడే ఇబ్బందులను చాలా ఫన్నీగా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు.