Begin typing your search above and press return to search.

పవన్‌ అప్పుడే అమ్మేశాడా?!

By:  Tupaki Desk   |   5 July 2015 7:00 PM IST
పవన్‌ అప్పుడే అమ్మేశాడా?!
X
స్టార్‌ హీరోల సినిమాల్ని బయ్యర్లు హాట్‌ కేకుల్లా కొనేస్తున్నారు. మిగతా హీరోల సినిమాల విషయంలో బయ్యర్ల వెంటపడాల్సి వస్తుంది కానీ... మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తదితర కథానాయకుల సినిమాల్ని ఏమాత్రం ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. అసలు వీళ్ల సినిమాలకి ఫస్ట్‌లుక్‌ రానవసరం లేదు, ట్రైలర్లు విడుదలవ్వాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉన్నా... ఓపెనింగ్స్‌ భారీగా ఉంటాయి కాబట్టి బయ్యర్లంతా కొబ్బరికాయ కొట్టినరోజునే రేటు మాట్లేడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతకుముందు సక్సెస్‌ ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా వీళ్ల సినిమాలకి బిజినెస్‌ జరిగిపోతుంటుంది.

పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'గబ్బర్‌సింగ్‌2' మరోసారి అదే విషయాన్ని నిరూపించింది. ఈ చిత్రం ఇంకా 10 శాతం కూడా పూర్తి కాలేదు. అప్పుడే వ్యాపారం జరిగిపోయింది. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని 63కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులోనే శాటిలైట్‌, డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ఉన్నాయట. అంటే చిత్రబృందం అనుకొన్న కథని ఎంత తక్కువలో తీసేస్తే నిర్మాతలకి అంత ఎక్కువ లాభమన్నమాట. నిర్మాత శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని 50కోట్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాడట. రైట్స్‌ కూడా అమ్ముడుపోయాయి కాబట్టి, పెట్టుబడికి సమస్యే లేదు కాబట్టి... వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేయాలని శరత్‌ భావిస్తున్నాడట. 50కోట్లలో సినిమా పూర్తయితే మాత్రం నిర్మాతకి 13 కోట్లు లాభం వచ్చినట్టవుతుంది.