Begin typing your search above and press return to search.
పుష్ప ఫ్లవర్ ఫైర్ డైలాగ్ వెనుక గబ్బర్ సింగ్ డైరెక్టర్ కథ
By: Tupaki Desk | 11 Oct 2022 5:53 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన పుష్ప సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా నార్త్ సౌత్ అన్ని చోట్ల కూడా సినిమా వందల కోట్ల వసూళ్లు రాబట్టడంతో మొత్తంగా నాలుగు వందల కోట్ల వరకు పుష్ప రాబట్టిందనే సమాచారం అందుతోంది.
పుష్ప సినిమాకి కలెక్షన్స్ మాత్రమే కాకుండా అవార్డులు కూడా చాలానే దక్కాయి అనడంలో సందేహం లేదు. కొన్ని రోజుల క్రితం జరిగిన సైమా అవార్డుల వేడుకలో పుష్ప సినిమా భారీగా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో కూడా అల్లు అర్జున్ పుష్ప టీమ్ చాలా అవార్డులను దక్కించుకుంది.
ఈ అవార్డుల వేడుక సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప సినిమా లోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. పైర్ అనే డైలాగ్ వెనుక ఉన్న స్టోరీ ని గురించి చెప్పాడు. ఆ డైలాగ్ పుట్టడానికి కారణం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ గా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ... పుష్ప సినిమా ప్రారంభానికి ముందు ఒకానొక సందర్భంగా హరీష్ శంకర్ ని కలవడం జరిగింది. ఆ సమయంలోనే పుష్ప అనే టైటిల్ అనుకుంటున్నాం అంటూ బన్నీ చెప్పాడట. పవర్ ఫుల్ స్టోరీకి పుష్ప అంటూ కాస్త సాఫ్ట్ టైటిల్ పెడితే ఎంత వరకు కరెక్ట్ అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశాడట.
పుష్ప అంటే నిజంగానే ఫ్లవర్ కనుక సాఫ్ట్ టైటిల్ అనుకుంటారు కదా సుకుమార్ గారు అంటూ బన్నీ వెళ్లి అక్కడ చెప్పడంతో వెంటనే సుకుమార్ ఆలోచించి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ ముందే చెప్పేదాం అంటూ డైలాగ్ ను రాశాడట. దాంతో ఆ డైలాగ్ ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో తెల్సిందే.
ఆ రోజు హరీష్ శంకర్ ఆ మాట అనుకుండా ఉంటే ఆ డైలాగ్ పుట్టి ఉండేది కాదు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత పలువురి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఎవరు ఎలాంటి మంచి సలహా ఇస్తారో కదా అనేది మేకర్స్ అభిప్రాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.