Begin typing your search above and press return to search.
గద్దలకొండ గణేష్ తొలి వీకెండ్ షేర్
By: Tupaki Desk | 23 Sep 2019 11:33 AM GMTవరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ తొలి వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ అందింది. శుక్ర- శని- ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.13.08 కోట్ల షేర్ సాధించిందని తెలుస్తోంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్త వసూళ్లను కలుపుకుని తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం 15.30కోట్ల వసూళ్లు సాధించింది.
ప్రాంతాల వారీగా షేర్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం -4.54 కోట్లు .. సీడెడ్ 2.05 కోట్లు.. నెల్లూరు 0.55కోట్లు.. కృష్ణా 1.07 కోట్లు.. గుంటూరు 1.23 కోట్లు.. వైజాగ్ 1.64 కోట్లు.. తూ.గో జిల్లా 1.03కోట్లు.. ప.గో జిల్లా 0.97కోట్లు వసూలైంది. ఏపీ తెలంగాణాలలో 13.08 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియా కోటి వసూలవ్వగా.. ఓవర్ సీస్ నుంచి 1.35 కోట్లు వసూలైంది. ప్రపంచ వ్యాప్తంగా షేర్ 16.30కోట్లు కలెక్టయ్యిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60శాతం రికవరీ అయ్యింది. ఇంకో40శాతం తేవాల్సి ఉంది.
సోమవారం నుండి అసలు పరీక్ష మొదలవుతుంది. నాన్ హాలీడేల్లోనూ వసూళ్లు స్థిరంగా సాధించి ఈ వారం అంతా బాగా తెస్తేనే బ్రేక్ ఈవెన్ కి వేగంగా చేరే వీలుంటుంది. వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ సినిమా వసూళ్లకు అనుకూలించే అంశం. అక్టోబరు 2న సైరా విడుదల అయ్యేవరకు గద్దలకొండ గణేష్ హవా సాగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.