Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరిపైనా గద్దలకొండ గణేష్ పంచ్!
By: Tupaki Desk | 21 Sep 2019 11:15 AM GMTఈ శుక్రవారం రెండు సినిమాలు రిలీజైతే అందులో ఒకటి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుంటే ఒకటి సరైన టాక్ లేక చతికిలబడింది. వరుణ్ తేజ్ వాల్మీకి చక్కని ఓపెనింగులు సాధిస్తే సూర్య నటించిన బందోబస్త్ కలెక్షన్స్ తీసికట్టుగా ఉన్నాయన్నది ట్రేడ్ రిపోర్ట్.
నిజానికి బందోబస్త్ తో పోలిస్తే తొలి నుంచి వరుణ్ తేజ్ `వాల్మీకి` (గద్దలకొండ గణేష్) పై మంచి అంచనాలున్నాయి. వరుణ్ తేజ్ లుక్ రిలీజ్ కాగానే అభిమానుల్ని ఆకర్షించింది. టీజర్- ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకు తగ్గట్టే ఓపెనింగులు దక్కుతున్నాయని తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ చిత్రం మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్లు వసూలు చేసింది. వరుణ్ లాంటి రైజింగ్ హీరోకి ఇది ది బెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. అయితే వాల్మీకి పెద్ద రేంజ్ బిజినెస్ చేసింది కాబట్టి తొలి వీకెండ్ అదరగొట్టినా సోమవారం నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద రాణించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
ఒకరికి మోదం ఒకరికి ఖేదం అన్న చందంగా.. వాల్మీకి (గద్దలకొండ గణేష్) దూకుడు వల్ల ఇంతకుముందు వారం రిలీజైన `గ్యాంగ్ లీడర్` కలెక్షన్స్ అంతకంతకు దిగజారినట్టేనని విశ్లేషిస్తున్నారు. వాల్మీకి పాజిటివ్ టాక్ తో గ్యాంగ్ వసూళ్లు బాగా తగ్గాయన్నది ట్రేడ్ మాట. చాలా చోట్ల ఇప్పటికే బయ్యర్లకు నష్టాలు తప్పేట్టు లేవని తేలింది. అలాగే వాల్మీకితో పాటు రిలీజైన బందోబస్త్ ఊహించని విధంగా ఓపెనింగులు తేలేక చతికిలబడింది. తెలుగు రాష్ట్రాల్లోనే అసలు సూర్య సినిమాల్లో ఇంత తక్కువ ఓపెనింగ్ ఇదివరకెన్నడూ లేదని తేలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి అయినా వసూలు చేయలేని ధీనస్థితికి పడిపోయిందన్నది తాజా రిపోర్ట్.