Begin typing your search above and press return to search.
గాజువాక లేడీ‘కండక్టర్’.. డ్యాన్స్ తో ఫిదా చేసింది..
By: Tupaki Desk | 28 Aug 2022 11:35 AM GMTగాజువాక పిల్ల.. మేం గాజులోల్లం కాదా? అన్న పాట వినపడగానే అందులో డ్యాన్స్ చేసిన ఈ ఊరి పిల్లే అందరి మదిలో మెదులుతోంది. ఇంతకీ ఎవరీమే అని ఆరాతీస్తే ఆమె ఒక ఆర్టీసీ బస్ కండక్టర్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఈమె డ్యాన్స్ ను హాబీగా మలుచుకుంది. ఆమెచేసే డ్యాన్సులు కుర్రకారు మతిని పోగొడుతున్నాయి.
గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్ గా పనిచేస్తున్న ఏ.ఝాన్సీ వివిధ కార్యక్రమాల్లో తన డ్యాన్స్ తో ఊర్రూతలూగిస్తుంది. తాజాగా ఈమెను ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలో ప్రదర్శించిన ఫోక్ డ్యాన్స్ కు పిలిచారు. ఇప్పుడు కుర్రకారును హుషారెత్తిస్తోంది. ఈ ప్రదర్శనకు మెచ్చి న్యాయనిర్ణేతలు వేదికపైకి వెళ్లి ఆమెతో కలిసి స్టెప్పులేసి అభినందిస్తున్నారు.
గాజువాక బీసీ రోడ్డుకు చెందిన ఝాన్సీ భర్త నూకరాజు.. ఆ దంపతులకు ఇద్దరు సంతానం.. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఆసక్తి ఉన్న కళలో ప్రశంసలందుకున్నారు. 8వ తరగతిలోనే డ్యాన్స్ నేర్చుకున్నా ఈమె పదోతరగతి పాసయ్యాక 2011లో ఆర్టీసీలో కండక్టర్ గా ఎంపికైంది. ఏడాది శిక్షణ తర్వాత గాజువాక డిపోలో విధుల్లో చేరింది. డ్యాన్స్ మాస్టర్లు శివ, విశాఖ థ్రిల్లర్ వెంకట్, శేఖర్, సురేష్ వద్ద శిక్షణ తీసుకుంది. రమేష్ మాస్టర్ అన్ని విధాలా ప్రోత్సహించి ఆమెకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకూ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. అక్కడి ప్రతిభతోనే టీవీషోల్లో అవకాశం దక్కింది. ఓ టీవీలో వచ్చిన డ్యాన్సింగ్ స్టార్ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం అందుకుంది. మరో చానల్ లో రంగం2, తీన్మార్ లో ఉత్తమ డ్యాన్సర్ అవార్డులు పొందింది. ఆర్టీసీ కార్యక్రమాల్లో డ్యాన్సర్ గా, వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంటారు.
ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసలు తెలియజేస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఈనెల 28న ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.