Begin typing your search above and press return to search.

గాజువాక కండక్టర్ జాన్సీకి ఆ హీరో ఛాన్స్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   17 Sep 2022 4:41 AM GMT
గాజువాక కండక్టర్ జాన్సీకి ఆ హీరో ఛాన్స్ ఇచ్చాడు
X
సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. తమకున్న సత్తాను చాటేందుకు పవర్ ఫుల్ మాధ్యమంగా మారిన సోషల్ మీడియా కారణంగా సామాన్యులు ఎందరో సెలబ్రిటీలుగా మారారని చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే..

సెలబ్రిటీలకు పుట్టిల్లు మాదిరి సోషల్ మీడియా మారింది. సోషల్ మీడియా స్పెషల్ ఏమంటే.. సాదాసీదా వ్యక్తిని తారా పథంలోకి దూసుకెళ్లేలా సాయం చేయటమే కాదు.. తోపు సెలబ్రిటీల్ని సైతం పాతాళానికి తొక్కేసేలా చేయటంలోనూ దాని రూటే సపరేటుగా చెప్పాలి.

ఎందరో ఔత్సాహికుల్ని స్టార్లుగా మార్చిన సోషల్ మీడియా.. వైజాగ్ లోని గాజువాక డిపోకు చెందిన బస్ కండక్టర్ జాన్సీని సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. మహిళా కండక్టర్ గా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే.. సోషల్ మీడియాలో చిట్టి వీడియోలు చేసే ఆమె వేసే హుషారు స్టెప్పులకు ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం చేసిన ఫోక్ సాంగ్ దెబ్బకు లైమ్ లైట్ లోకి వచ్చారు. సదరు ఫోకస్ సాంగ్ కు అదిరే స్టెప్పులు వేసిన ఆమె ఆకట్టుకోవటమే కాదు.. కండక్టర్ ఝాన్సీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

సదరు టీవీ షో తర్వాత ఆమె పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వెండితెర మీద జాన్సీ మెరవనుంది. తాజాగా ఒక హీరో ఆమెకు ప్రత్యేక పాటతో డ్యాన్స్ వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

సంపూర్ణేష్ బాబు. తాజాగా తాను నటిస్తున్న ఒక మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను నేరుగా సంప్రదించాడు. తనకు సినిమాలో అవకాశం ఇస్తూ.. సంపూర్ణేష్ బాబు స్వయంగా ఫోన్ చేయటంపై జాన్సీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఓకే చెప్పేసింది. త్వరలోనే ఈ ప్రత్యేక పాట షూట్ మొదలవుతుందని చెబుతున్నారు. కొత్త టాలెంట్ ను తెర మీదకు తెచ్చేందుకు ఒక అడుగు ముందుకేసిన సంపూర్ణేశ్ బాబును అభినందించాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.