Begin typing your search above and press return to search.
శ్రీ విష్ణు 'గాలి సంపత్' షూటింగ్ షురూ..!
By: Tupaki Desk | 18 Nov 2020 1:10 PM GMTటాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు - నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ''గాలి సంపత్". లవ్ లీ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది మరియు అనిల్ స్నేహితుడు ఎస్. క్రిష్ణ (ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ సైడ్ మెంటర్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు దిల్ రాజు - నారా రోహిత్ - వరుణ్ తేజ్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన 'గాలి సంపత్' కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.
కాగా, 'గాలి సంపత్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (నవంబర్ 18) నుంచి ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ ను ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మద్య జరిగే బ్యూటిఫుల్ జర్నీకి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషన్ కూడా జత చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే మిర్చి కిరణ్ సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి - సత్య, రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - మిర్చి కిరణ్ - సురేంద్ర రెడ్డి - గగన్ - మిమ్స్ మధు - అనీష్ కురువిల్లా - రజిత - కరాటే కళ్యాణి - సాయి శ్రీనివాస్ - రూప లక్ష్మి తదితరులు నటించనున్నారు.