Begin typing your search above and press return to search.
రిలీజ్ ట్రైలర్: పుట్టుక నుంచి మరణం వరకూ ఉండే మజిలీలను చూపించే 'గమనం'
By: Tupaki Desk | 9 Dec 2021 2:30 PM GMTసీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ''గమనం''. యువ హీరో శివ కందుకూరి - ప్రియాంక జవాల్కర్ - చారు హసన్ - నిత్యా మీనన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సుజనా రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం (డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'గమనం' చిత్రంలో పుట్టుక నుంచి మరణం వరకూ ఉండే మజిలీలను వివిధ పాత్రల ద్వారా ఓ జీవిత ప్రయాణంగా చూపిస్తున్నామని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. గ్రాండ్ గా నిర్వహించబడిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో లేటెస్టుగా రిలీజ్ ట్రైలర్ ను వదిలారు.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సాగిన 'గమనం' రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసే సున్నితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో భర్తకు దూరమైన వినికిడి లోపం ఉన్న సాధారణ గృహిణిగా శ్రియా కనిపించనుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని కలలు కనే కుర్రాడిగా శివ కందుకూరి.. అతని ప్రేయసిగా ప్రియాంక జవాల్కర్.. శాస్త్రీయ సంగీత గాయనిగా నిత్యా మీనన్ నటించారు.
ట్రైలర్ ని బట్టి చూస్తే.. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వీరందరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల సమూహారమే 'గమనం' చిత్రమని తెలుస్తోంది. మాస్ట్రో ఇళయరాజా సమకూర్చిన నేపథ్య సంగీతం.. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రంలో సంభాషణలు రాయగా.. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. రామకృష్ణ అర్రం ఎడిటింగ్ వర్క్ చేశారు.
'గమనం' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్ - కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్ - రమేష్ కరుటూరి - వెంకీ పుషడపు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.