Begin typing your search above and press return to search.
'గమనం' సక్సెస్ ముచ్చట్లు
By: Tupaki Desk | 12 Dec 2021 4:35 AM GMTశ్రియ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'గమనం' సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. రమేశ్ కరుటూరి .. వెంకీ పుషడపు .. జ్ఞానశేఖర్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాతో, సుజనారావు దర్శకురాలిగా పరిచయమయ్యారు. విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందంటూ, నిన్న సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో శ్రియ మాట్లాడుతూ .. 'గమనం' ఒక అందమైన సినిమా .. కొన్ని జీవితాలను చాలా దగ్గరగా చూపించిన సినిమా. ఈ సినిమాలో నేను పోషించిన కమల పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం.
నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. నిజంగా నేను ఈ పాత్రను చాలా అనుభవించి చేశాను. ఈ సినిమా విజయంలో జ్ఞానశేఖర్ గారు చాలా కీలకమైన పాత్రను పోషించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆయన గొప్పతనాన్ని చెబుతాయి. అలాగే దర్శకురాలు సుజనారావు కూడా ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశారు. కమల పాత్రతో పాటు మిగతా పాత్రలను కూడా చాలా సహజంగా డిజైన్ చేశారు. సాయిమాధవ్ బుర్రాగారు ఈ సినిమాకి చాలా అద్భుతమైన డైలాగ్స్ ను అందించారు. అలీ .. జారా పాత్రలను శివ కందుకూరి .. ప్రియాంక జవాల్కర్ చాలా బాగా చేశారు. ఈ సినిమాను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను ఇంకా చూడని వాళ్లు .. థియేటర్లకు వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత శివ కందుకూరి మాట్లాడుతూ .. "ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా .. సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లంతా కూడా చాలా మంచి సినిమా చూశామని అంటున్నారు. అలాంటి రెస్పాన్స్ రావడమే మేము సాధించిన సక్సెస్ గా భావిస్తున్నాము. ఇలాంటి సినిమాలు .. కథలు చాలా తక్కువగా వస్తాయి. అలాంటి ఈ సినిమాలో అవకాశం రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అలీ అనే పాత్రను ఇంత బాగా రాసినందుకు .. నన్ను ఆ పాత్ర కోసం తీసుకున్నందుకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకిత భావంతో కష్టపడ్డారు. నా కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ సినిమాతో టీమ్ అంతా కూడా నా ఫ్యామిలీగా మారిపోయింది.
అలీ అనే పాత్ర నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. జ్ఞానశేఖర్ గారు ఈ సినిమాలో మమ్మల్ని ఎంతో అందంగా చూపించారు. సాయిమాధవ్ బుర్రగారు మాతో ఎంతో అందమైన మాటలను చెప్పించారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్టు చేయడం మాకు ఒక అదృష్టం. ఆయన అందించిన సంగీతం వలన ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లింది. ఆయనలాంటివారి ఆశీస్సుల కారణంగానే ఈ రోజున ఈ సినిమాకి ఈ స్థాయి సక్సెస్ వచ్చింది. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నాడు. ఇలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు తనకి చాలా సంతోషంగా ఉందని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. "నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అని సుజనారావు అన్నారు.