Begin typing your search above and press return to search.
మెగా 'గేమ్ ఛేంజర్' సూపర్ అప్డేట్
By: Tupaki Desk | 10 May 2023 3:46 PMమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.
దర్శకుడు శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాని కూడా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇండియన్ 2 షూటింగ్ లో ప్రస్తుతం శంకర్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమా యొక్క క్లైమాక్స్ షూటింగ్ ను పూర్తి చేశారు.
రామ్ చరణ్ తో పాటు వందలాది మంది ఫైటర్స్ పాల్గొన్న గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకి అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాల విషయంలో మేకర్స్ కూడా సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రకు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా మరో పాత్రకు జోడీగా తెలుగు అమ్మాయి అంజలి జోడీగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి అమాంతం పెరిగిన విషయం తెల్సిందే. అందుకే గేమ్ ఛేంజర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా ఏకకాలంలో రూపొందించడం జరిగింది. కొన్ని సన్నివేశాలను వేరు వేరు నటులతో రెండు సార్లు చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.