Begin typing your search above and press return to search.
ఎమ్మీస్ 2019: గేమ్ ఆఫ్ థ్రోన్ 32 నామినేషన్లు
By: Tupaki Desk | 18 July 2019 1:30 AM GMTఅమెరికన్ ఫాంటసీ డ్రామా టెలివిజన్ సిరీస్ `గేమ్ ఆఫ్ థ్రోన్స్` కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఇదో సంచలనం. మాస్ మహారాజా రవితేజ .. నందమూరి కళ్యాణ్ రామ్ సహా పలువురు స్టార్లు నెట్ ఫ్లిక్స్ సహా పలు డిజిటల్ మాధ్యమాల్ని అనుసరిస్తుంటారు. సెలబ్రిటీల్లో మెజారిటీ పార్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ లను వీక్షిస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ చివరిదైన ఎనిమిదవ సీజన్ ప్రారంభమై ప్రస్తుతం లైవ్ ఎపిసోడ్స్ ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ పొందుతున్నాయి. ప్రముఖ నటులు జాన్ స్నో - సాన్సా స్టార్క్ - ఆర్యా స్టార్క్ తదితరులు ఈ సీజన్ లో నటిస్తున్నారు. సీజన్ 7 వరకు `గేమ్ ఆఫ్ థ్రోన్స్`లో ఏడు ఎపిసోడ్లు ఉంటే.. ఎనిమిదో సీజన్ లో కేవలం ఆరు ఎపిసోడ్ లను రన్ చేస్తుండడం ఆసక్తికరం.
తాజాగా ఎమ్మీస్ అవార్డ్స్ సందడి మొదలైంది. సినిమాలకు అకాడమీ అవార్డ్స్ ఎంత విలువైనవో టీవీ షోలు.. సీరియళ్లకు ఎమ్మీస్ అవార్డ్స్ అలాంటివి. 2018 ఎమ్మీ అవార్డుల్లో బెస్ట్ డ్రామా సిరీస్ కేటగిరీలో `గేమ్ ఆఫ్ థ్రోన్స్` అవార్డును గెలుచుకుంది. ఈసారి కూడా 2019 ఎమ్మీ అవార్డ్స్ కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ పోటీపడుతోంది. తాజాగా ఎమ్మీస్ 2019 పురస్కారాలకు నామినేషన్లను ప్రకటించగా అందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏకంగా 32 నామినేషన్ల తో పోటీపడుతోంది.
ఇప్పటివరకూ ఈ తరహాలో ఒక టీవీ షో ఇన్ని నామినేషన్లతో పోటీకి దిగడం అన్నది తొలిసారి. 1994లో ఎన్ వై పీడీ బ్లూ పేరుతో ప్రసారమైన టీవీ షో అప్పట్లో ఏకంగా 27 నామినేషన్లతో పోటీపడడం సంచలనమైంది. మళ్లీ ఇంతకాలానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. దీనిని బట్టి వెబ్ సిరీస్ లలో గేమ్ ఆఫ్ థ్రోన్ కి ఉన్న క్రేజును అర్థం చేసుకోవచ్చు.