Begin typing your search above and press return to search.

రాజమౌళి కూడా ఇలాగే చేసాడేమో

By:  Tupaki Desk   |   15 Sep 2017 7:29 AM GMT
రాజమౌళి కూడా ఇలాగే చేసాడేమో
X
ఒక సినిమాకి క్లైమాక్స్ చాలా ముఖ్యం. ప్రధానంగా థ్రిల్లర్స్ విషయంలోనూ.. యాక్షన్ మూవీస్ లోనూ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్ ఆఫ్ థ్రేన్స్ కు ఆఖరి సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కి క్లైమాక్స్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.

ఆడియన్స్ కు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉండాలన్నది మేకర్స్ యోచనగా తెలుస్తోంది. అందుకే ఈ సిరీస్ కు మల్టిపుల్ క్లైమాక్స్ లు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హెచ్‌ బీ ఓ ప్రోగ్రామింగ్ హెడ్ చెబుతున్నారు. ఇలా ఒకటే ప్రోగ్రామ్ కి పలు రకాల క్లైమాక్స్ లు చిత్రీకరించడంతో.. ఆఖరికి ఆర్టిస్టులకు కూడా అసలు క్లైమాక్స్ ఏంటో తెలియకుండా ఉంటుందని భావిస్తున్నారట. భవిష్యత్తులో మన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇలాగే చేసే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. బాహుబలి విషయంలోనే ఇలాంటి రూమర్స్ వచ్చాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండేందుకు గాను.. పలు రకాల ఎపిసోడ్స్ తీస్తారని అన్నారు.

అలాగే క్లైమాక్స్ లు 2-3 చిత్రీకరించారనే టాక్ వచ్చింది. కానీ ఒకటి తీయడానికే టైం సరిపోలేదని.. జక్కన్న తేల్చేయడంతో ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. కానీ మళ్లీ ఇంతటి భారీ ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం.. కచ్చితంగా రాజమౌళి ఈ మల్టిపుల్ క్లైమాక్స్ ట్రెండ్ ను ఫాలో కావచ్చు.