Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ఒంటరి భయం
By: Tupaki Desk | 15 May 2019 9:01 AM GMTబాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలతో పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్న పాత్రలను చేస్తున్న తాప్సీ కొత్త మూవీ గేమ్ ఓవర్. ఇందాకా టీజర్ విడుదల చేశారు. ప్రతి మనిషికి రెండు జీవితాలు ఉంటాయన్న థీమ్ తో ఒంటరిగా ఉన్న తాప్సీకి ఇంట్లో ఎదురయ్యే భయానక అనుభవాలను కథగా రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇరవై ఏళ్ళ క్రితం పిల్లలను ఒక ఊపు ఊపేసిన జాయ్ స్టిక్స్ వీడియో గేమ్ లో చివరిలో వచ్చే గేమ్ ఓవర్ అనే పాయింట్ కి తాప్సీ పాత్రకు ఏదో ముడిపెట్టినట్టు కనిపిస్తోంది.
టీజర్ లో రెండు మూడు షాట్స్ లో కనిపించే పని మనిషి తప్ప ఇంకెవరు ఆర్టిస్టులు ఉన్నట్టు లేరు. గతంలో ఇదే తరహాలో వర్మ ఊర్మిలాతో ఎవరు అనే సినిమా తీశాడు. తనతో పాటు మనోజ్ బాజ్ పాయ్ ఇలా రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. కథను ఈ టీజర్ లో ఎక్కువగా రివీల్ చేయలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే భయాన్ని మాత్రమే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది.
మొత్తం సింగల్ హౌస్ ఇన్ డోర్ కాబట్టి విజువల్స్ మరీ గొప్పగా ఏమి లేవు. కంటెంట్ ని వీలైనంత ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్త పడటంతో పూర్తిగా ఇంప్రెస్ చేయలేకపోయింది. తాప్సీ మాత్రం మరో ఛాలెంజ్ అనిపించే రోల్ చేసినట్టే కనిపిస్తోంది. రాన్ ఎతోన్ యేహన్ సంగీతం అందించిన గేమ్ ఓవర్ కి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మల్టీ లాంగ్వేజ్ తరహాలో హిందితో పాటు సౌత్ లో ఉన్న అన్ని బాషల్లోనూ దీన్ని విడుదల చేయనున్నారు.