Begin typing your search above and press return to search.

గాంధి జయంతికి దసరా శుభాకాంక్షలా?

By:  Tupaki Desk   |   3 Oct 2017 10:51 AM GMT
గాంధి జయంతికి దసరా శుభాకాంక్షలా?
X
సాధారణంగా మహాత్ముల జయంతిలకు గాని వర్దంతిలకు గాని అందరు సోషల్ మీడియాలో స్పందించడం కామన్. అయితే అప్పుడప్పుడు సెలబ్రెటీలు వాటి మాద్య తేడాను మర్చిపోతుంటారు. ఇక ఆ తర్వాత ఎందుకు చెప్పమురా దేవుడా అని బుర్ర బద్దలు కొట్టుకుంటారు. ఈ రోజుల్లో రాజకీయా నాయకులు కూడా ఆ తరహాలో కొన్ని సార్లు తడబడ్డ విషయం తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఒక హీరోయిన్ ఎవరు ఊహించని విధంగా ఒక కామెంట్ చేసేయడం అందరిని షాక్ కి గురి చేసింది. నిన్న గాంధీ జయంతి సందర్భంగా తారలు - రాజకీయ నేతలు ఎవరి స్థాయిలో వారు స్పందించిన విషయం తెలిసిందే. అయితే సీనియర్ హీరోయిన్ పూనమ్ బాజ్వా మాత్రం తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని గాంధీ జయంతి రోజు అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఇప్పుడు తెల్లారిందా.. అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు వేరొక విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

పూనమ్ 'మొదటి సినిమా' ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే - ఐ లవ్ యు సినిమాల్లో కూడా మెరిసింది. చివరగా అల్లు అర్జున్ పరుగు నాగార్జున బాస్ సినిమాల్లో కనిపించిన పూనమ్ తెలుగులో అంతగా రాణించలేదు. ఎక్కువగా తమిళ్ కన్నడలోనే సినిమాలను చేస్తోంది. ఓం 3డి.. తిక్క దర్శకుడు సునీల్ రెడ్డితో ప్రేమలో ఉందనేది ఒక రూమర్.