Begin typing your search above and press return to search.
నాన్న నవలలపై మేర్లపాక గాంధీ సినిమా!
By: Tupaki Desk | 4 Nov 2022 1:30 AM GMTతొలి సినిమా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తోనే మేర్లపాక గాంధి విజయం సాధించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాతో హీరో సందీప్ కిషన్ కెరీర్ కూడా ఊపందుకుంది. ఆ సినిమా తర్వాత మూడేళ్లకు శర్వానంద్ తో 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. అటుపై నాని తో అవకాశం వచ్చింది.
బుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన వరస విజయాలతో దూసుకుపోతున్న నానితో 'కృష్ణార్జున యుద్ధం' తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఈ క్రమంలో మరోసారి రైటర్ గా టర్న్ తీసుకుని 'ఏక్ మినీ కథ'కు పనిచేసారు. ఇది యావరేజ్ గా ఆడింది. అయితే వీటితో సంబంధం లేకుండా గాంధీ ప్రతిభను గుర్తించి యూత్ స్టార్ నితిన్ 'మాస్ర్టో'తో అవకాశం కల్పించాడు.
ఆ సినిమా తో హిట్ అందుకుని రేసులోకి రావాలని శ్రమించారు. కానీ మరోసారి ఫలితం తీవ్ర నిరాశని మిగిల్చింది. త్వరలో 'లైక్ షేర్..సబ్ స్ర్కైబ్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వాటిని అందుకుంటాడా? లేదా? అన్నది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతుంది.
అయితే గాంధీ తండ్రి మేర్లపాక మురళి నవలా రచయితగా చాలా ఫేమస్. ఎన్నో నవలలు రచించారు. రచయితగాతనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. రచయితగా నాన్న దగ్గర ఓనమాలు నేర్చుకుని ఇండస్ర్టీకి వచ్చాడు గాంధీ. కెరీర్ ప్రారంభమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా? ఇంతవరకూ నాన్న నవలల్ని మాత్రం గాంధీ టచ్ చేయలేదు.
ఆయన సొంత రైటింగ్ తోనే సినిమాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో తండ్రి నవలలతో సినిమా చేయోచ్చు! కదాని చాలా మంది అడుగుతున్నారు. కానీ గాంధీ మాత్రం వాటిని టచ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో గాంధీ సైతం అందుకు సై అనేసాడు. తన మనసులో కొర్కెను తాజాగా బయట పెట్టాడు. మురళి నవలలతో ఓ సినిమా చేయాలని తనకి ఉందని తెలిపాడు.
నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి..తండ్రి నవలతో సినిమా చేస్తానని గాంధీ తెలిపారు. మరి ఆ సినిమాలో హీరో ఎవరు అవుతారో చూడాలి. అలాగే తన కమిట్ మెంట్ల గురించి రివీల్ చేసాడు. పీపూల్ మీడియా ఫ్యాక్టరీ..యూవీ క్రియేషన్స్ ..నిహారిక ఎంటర్ టైన్ మెంట్... నిర్మాత కృష్ణతో సినిమాలు చేయాల్సి ఉందని..ఎప్పటి నుంచో అవి వాయిదా పడుతూ వస్తున్నాయని..ఈసారి అలా కాకుండా వీలైనంత త్వరగా ఆ కమిట్ మెంట్లను పూర్తి చేస్తానని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.