Begin typing your search above and press return to search.
గ్యాంగ్ లీడర్ కు 30 ఏళ్లు.. ఇది నాగబాబు చేయాల్సింది తెలుసా?
By: Tupaki Desk | 9 May 2021 8:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. సూపర్ హిట్ చిత్రాల్లో కొన్ని ప్రత్యేక సినిమాలు ఉంటాయి. అందులో ఒకటి గ్యాంగ్ లీడర్. విజయశాంతి హీరోయిన్ గా నటించిన గ్యాంగ్ లీడర్ కు విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. మెగా ఫ్యామిలీ హీరోల్లో చాలా మందికి ఈ సినిమా రీమేక్ చేయాలనే కోరిక ఉంటుంది కాని బయట పడరు. ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా గ్యాంగ్ లీడర్ రీమేక్ ఖాయం అంటూ మెగా ఫ్యామిలీ అప్పుడప్పుడు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా చిరంజీవి చేయడం వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని మెగా వర్గాలు చెబుతూ ఉంటారు.
గ్యాంగ్ లీడర్ మూవీ వెనుక కథ విషయానికి వెళ్తే... చిరంజీవి తమ్ముడిగా నాగబాబు అప్పుడప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాగబాబు సినిమాలు చేస్తూ కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి నటించిన ఒక సినిమాలో నాగబాబును చూసిన పరుచూరి బ్రదర్స్ హీరోగా ట్రై చేయమంటూ సలహా ఇచ్చారు. నాగబాబు కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించాడు. నాగబాబు కోసం పరుచూరి వారితో కలిసి విజయ బాపినీడు అరేఓ సాంబ అనే టైటిల్ తో ఒక కథను సిద్దం చేశారు. హీరో పాత్ర చాలా పవర్ ఫుల్ మరియు కాస్త ఎక్కువ బడ్జెట్ కథ అవ్వడంతో నాగబాబు తో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదని ముందే మేకర్స్ భావించారు.
నాగబాబు కూడా ఈ కథను నేను చేయడం కంటే అన్నయ్య చిరంజీవి చేస్తే మంచి హిట్ అవుతుందని భావించాడు. విజయ బాపినీడును కథతో పాటు చిరంజీవి వద్దకు పంపించాడు. కథ కు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి టైటిల్ ను గ్యాంగ్ లీడర్ గా మార్చి చిరంజీవి అదే కథను చేశాడు. నాగబాబు చేయకుండా వదిలేసిన గ్యాంగ్ లీడర్ కథ చిరంజీవి వద్దకు రావడం అది కాస్త సూపర్ డూపర్ హిట్ అవ్వడం అంతా చకచక జరిగి పోయింది. 30 ఏళ్లు అయినా కూడా చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా టీవీలో వస్తుంది అంటూ ప్రేక్షకులు అటెన్షన్ అన్నట్లుగా అవుతారు.