Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్

By:  Tupaki Desk   |   10 Sep 2019 10:42 AM GMT
గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్
X
న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'నానీస్ గ్యాంగ్ లీడర్'. సెప్టెంబర్ 13 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో కూడా డీసెంట్ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకు సాక్ష్యం.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ రూపంలోదాదాపు రూ. 28 కోట్లు వచ్చాయి. నాని మార్కెట్ రేంజ్ కు ఇది భారీ ఫిగర్ అని చెప్పలేం కానీ డీసెంట్ అని చెప్పుకోవాలి. సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ మొత్తాన్ని నాని సినిమా ఈజీగానే రికవర్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ 'గ్యాంగ్ లీడర్' సక్సెస్ చాలా ఇంపార్టెంట్. హీరో నాని.. నెగెటివ్ రోల్ చేసిన కార్తికేయ.. దర్శకుడు విక్రమ్ కుమార్.. నిర్మాతలు మైత్రీ వారు.. ఇలా అందరూ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నవారే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ పెద్దది కాకపోవడం ఓ రకంగా ఈ సినిమాకు ప్లస్సే.

ప్రపంచవ్యాప్తంగా 'నానిస్ గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.

నైజామ్: 8.10 cr

సీడెడ్: 3.50 cr

ఉత్తరాంధ్ర: 2.55 cr

కృష్ణ: 1.50 cr

గుంటూరు: 1.70 cr

ఈస్ట్ : 1.65 cr

వెస్ట్: 1.25 cr

నెల్లూరు: 0.80 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 21.05 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.85 cr

ఓవర్సీస్: 5.40 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 28.30 cr