Begin typing your search above and press return to search.
US: గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ డీసెంట్
By: Tupaki Desk | 14 Sep 2019 6:38 AM GMTనాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రివ్యూయర్ల నుండి.. క్రిటిక్స్ నుండి యావరేజ్ మార్కులే వచ్చాయి. అయితే క్లీన్ ఫిలిం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కవచ్చని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. మరి కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉంది?
అమెరికా కలెక్షన్స్ విషయం తీసుకుంటే గురువారం ప్రీమియర్లు.. శుక్రవారం కలిసి టోటల్ గా $350K కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. ఇందులో ప్రీమియర్ కలెక్షన్స్ లెక్క $185K. ఈ కలెక్షన్స్ నాని సినిమాకు డీసెంట్ అనే చెప్పాలి. అయితే నాని గత చిత్రం 'జెర్సీ' కలెక్షన్స్ తో పోలిస్తే మాత్రం ఇవి తక్కువే. ఎందుకంటే 'జెర్సీ' ప్రీమియర్స్ + మొదటి రోజు కలెక్షన్స్ $410K. శనివారం.. ఆదివారం కలెక్షన్స్ ను బట్టే మనకు 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి ఓవర్సీస్ లో ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల నుండి ఫైనల్ కలెక్షన్ ఫిగర్స్ రావాల్సి ఉంది. డొమెస్టిక్ గా కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్సే నమోదు చేసిందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ లేకపోవడం ఈ సినిమాకు మొదటి వారంలో ప్లస్ గా మారనుంది.