Begin typing your search above and press return to search.
నాగార్జున ఫ్యామిలీ మ్యాటర్స్ లాగిన గంగవ్వ..! కింగ్ రియాక్షన్ చూస్తే...
By: Tupaki Desk | 25 March 2021 11:30 PM GMTయూట్యూబ్ లో కామెడీ వీడియోల ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారిపోయారు. ఆ షోలోనుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ఆమె.. చాలా రోజుల తర్వాత నాగార్జునను కలిశారు. అది కూడా.. నాగ్ అప్ కమింగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్ కోసం కావడం విశేషం.
ఈ సందర్భంగా యాంకర్ గా మారిన గంగవ్వ.. కింగ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ముచ్చట్లు మొదలు.. నాగార్జున ఫ్యామిలీ ముచ్చట్ల వరకు అన్ని విషయాలనూ చుట్టేసింది గంగవ్వ. సినిమా గురించి పలు విషయాలు మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యుల విషయాలను డిస్కస్ చేశారు.
నాగ చైతన్య - సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నారా? అని అడిగింది గంగవ్వ. ‘పెద్దకొడుకు కోడలు మనవళ్లని ఇస్తున్నారా?’ అని అడగ్గా.. తాను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పారు నాగ్. ‘నేను కూడా వాళ్లను అదే అడుగుతున్నాను. వారసుడి కోసం ఎదురు చూస్తున్నాను’ అని సమాధానం ఇచ్చారు కింగ్.
ఆ తర్వాత అఖిల్ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చిం గంగవ్వ. ‘చిన్నకొడుకు పెళ్లి ఎప్పుడు?’ అని అడిగిన ప్రశ్నకు.. ‘నిర్ణయం అతనికే వదిలేశాను’ అని చెప్పారు నాగార్జున. దానికి ఆమె స్పందిస్తూ.. అలా వదిలేయొద్దని, మీరే సంబంధం చూడాలని, లేదంటే ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పింది గంగవ్వ. తమ ఊళ్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, అఖిల్ కు తాను పిల్లను చూస్తానని అన్నారు గంగవ్వ. దీంతో నాగార్జున పగలబడి నవ్వేశారు. ఆ తర్వాత ‘వైల్డ్ డాగ్’ యూనిట్ ను గంగవ్వకు పరిచయం చేశారు నాగ్.