Begin typing your search above and press return to search.
గంగోత్రి విడుదలై 18ఏళ్లు.. అల్లు అర్జున్ ఏమన్నాడో తెలుసా?
By: Tupaki Desk | 28 March 2021 10:46 AM GMTఇక్కడ త్రివిక్రమ్ మాటలను గుర్తు చేసుకోవాలి. ‘‘అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’. 28 మార్చి 2003న అద్భుతం జరగడం మొదలైంది. కానీ.. దాన్ని ఎంతమంది గుర్తించారంటే సందేహమే. కానీ.. ఆ అద్భుతం నేడు టాలీవుడ్ లో స్టార్ కటౌట్ గా నిలబడింది. అదే అల్లు అర్జున్ కెరీర్!
అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. ఈ చిత్రం సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధింది. అక్కడి నుంచి మొదలైన బన్నీ ప్రయాణం.. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
కెరియర్లో హిట్లతోపాటు ఫ్లాపులు కూడా సహజం.. కానీ, మన రేంజ్ ఎలా ఉందన్నదే పాయింట్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన బన్నీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తన తొలి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
‘‘నా మొదటి చిత్రం విడుదలై 18 ఏళ్లవుతోంది. నా సినీ ప్రస్థానంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇన్నేళ్లపాటు నాపై ప్రేమను కురిపించినందుకు నేను అదృష్టవంతుడిని. మీ ఆశీర్వాదాలు అందించినందుకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.