Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్ట‌ర్ మూవీస్ కోలీవుడ్ లో ఎప్పుడూ బెస్ట్ నే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 8:30 AM GMT
గ్యాంగ్ స్ట‌ర్ మూవీస్ కోలీవుడ్ లో ఎప్పుడూ బెస్ట్ నే!
X
కోలీవుడ్ లో వ‌చ్చిన గ్యాంగ్ స్టార్ మూవీస్ ఎప్పుడూ నిరాశ ప‌రిచిన చ‌రిత్ర లేదు. ఈ నేప‌థ్యంలో ఏ సినిమా వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచి సంచ‌ల‌నం సృష్టించాయి. నాయ‌కుడు, న‌వాబ్ వంటి సినిమాలే ఇందుకు నిద‌ర్శ‌నం. ఆ ప‌రంప‌ర‌ని రీసెంట్ గా విడుద‌లైన శింబు గ్యాంగ్ స్ట‌ర్ మూవీ 'వెంధు తానిధాతు కాడు' మ‌రోసారి నిరూపించింది. వివ‌రాల్లోకి వెళితే...గ‌త కొన్నేళ్లుగా త‌మిళ హీరో శింబు స‌రైన స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ద‌శ‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుడంతో ఇక శింబు కెరీర్ అయిపోయిన‌ట్టేనా? అనే కామెంట్ లు కూడా కోలీవుడ్ లో బ‌లంగా వినిపించాయి.

అలాంటి టైమ్ లో భారీగా బ‌రువు త‌గ్గి షాకింగ్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ లోకి వ‌చ్చేసిన శింబు అదే జోష్ తో వెంక‌ట్ ప్ర‌భు దెర‌కెక్కించిన సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మానాడు'తో మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని ద‌క్కించుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. త‌మిళ‌నాట సంచల‌నం సృష్టించిన ఈ మూవీతో తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకోవాల‌ని శింబు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. 'మానాడు' మూవీ రీమేక్ హ‌క్కుల్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్ బాబు ద‌క్కించుకోవ‌డంతో శింబు ఆశ‌లు ఆవిరైపోయాయి.

ఇదిలా వుంటే కొన్నేళ్ల విరామం త‌రువాత ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్ లో శింబు న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ ఫిల్మ్ 'వెంధు తానిధాతు కాడు' తో సెప్టెంబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రెండు భాగాలుగా ఈ మూవీరి రిలీజ్ చేయాల‌ని గౌత‌మ్ మీన‌న్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.

అందులో భాగంగానే ముందుగా ఫ‌స్ట్ పార్ట్ ని విడుద‌ల చేశారు. త‌మిళంలో సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైన ఈ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా మూవీ తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు 1' పేరుతో రెండు రోజులు ఆల‌స్యంగా అంటే సెప్టెంబ‌ర్ 17న‌ విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇది శింబు, గౌత‌మ్ మీన‌న్ ల క‌ల‌యిక‌లో రూపొందిన నాలుగవ మూవీ. గ‌తంలో ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మంచి విజ‌యాల్ని సాధించాయి. అదే త‌ర‌హాలో తాజాగా విడుద‌లైన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు - 1' సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన శింబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో పార్ట్ 2 ఎలా వుండ‌నుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో చెన్నైలో జ‌రిగిన థాంక్స్ మీట్ లో నిర్మాత డా. ఇషారి కె. గ‌ణేష్ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

పార్ట్ 2 ప‌నులు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయ‌ని, స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లైంద‌ని, గౌత‌మ్ మీన‌న్‌, ర‌చ‌యిత జయ‌మోహ‌న్ వ‌ర్క్ మొద‌లు పెట్టార‌ని, వ‌న్స్ స్క్రిప్ట్ పూర్త‌యిన వెంట‌నే పార్ట్ 2 షూటింగ్ ని ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు - 1' క్లైమాక్స్ లో పార్ట్ 2కు డైరెక్ట‌ర్ లీడ్ వ‌దిలిన విష‌యం తెలిసిందే. ఈ మూవీలో సిద్దీ ఇద్నానీ హీరోయిన్ గా న‌టించ‌గా కీల‌క పాత్ర‌ల్లో రాధికా శ‌ర‌త్ కుమార్‌, సిద్ధిఖ్‌, నీర‌జ్ మాధ‌వ్‌, నీర‌జ్ మాధ‌వ్‌, ఢిల్లీ గ‌ణేష్ త‌దిత‌రులు నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.