Begin typing your search above and press return to search.
టైగర్ ను బెదిరించిన గ్యాంగ్ స్టర్
By: Tupaki Desk | 5 Jan 2018 2:10 PM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు మాంచి జోష్ మీదే ఉన్నాడు. గతేడాది మధ్యలో ట్యూబ్ లైట్ మూవీ ఫ్లాప్ తో దిగాలు పడ్డ సల్మాన్ కు.. క్రిస్మక్ కు వచ్చిన టైగర్ జిందా హై మూవీ ఉత్సాహం ఇచ్చింది. ఈ చిత్రం 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుండడం.. ఈ ఘనత సాధించిన సల్మాన్ ఖాన్ మూడో చిత్రంగా నిలవనుండడం ఇందుకు కారణంగా చెప్పచ్చు.
అయితే సల్మాన్ ఖాన్ కు పాత కష్టాలు తీరడం లేదు. తాజాగా ఈ బాలీవుడ్ స్టార్ హీరో.. జోధ్ పూర్ లోని జుడీషియల్ మెజిస్ట్రేట్ రూరల్ కోర్టు ముందు హాజరయ్యాడు. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణలో భాగంగా కోర్టుకు వచ్చాడు సల్లూ భాయ్. ఇదే సమయంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ విష్ణోయి కూడా అదే కోర్టుకు వచ్చాడు. దోపిడీకి సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న లారెన్స్.. జింకల వేట కేసు ఎదుర్కొంటున్న సల్మాన్.. ఒకే సమయంలో కోర్టు లోపలకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ సమయంలో సల్మాన్ ను బెదిరించాడట లారెన్స్ విష్ణోయి. బాలీవుడ్ హీరోను ఎందుకు బెదిరించాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే.. కోర్టు ప్రాంగణంలోనే ఈ సంఘటన జరగడంతో.. అందరికీ ఈ ఇన్సిడెంట్ బాగానే నోటీస్ అయింది. మరోవైపు.. సల్మాన్ కేసు విషయానికి వస్తే.. హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ జింకల వేట సంఘటన జరిగిందనే ఆరోపణలు ఉండగా.. ఆ సమయంలో సోనాలి బింద్రే.. సైఫ్ అలీ ఖాన్.. టబు.. నీలమ్ లు కూడా సల్మాన్ తో పాటే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.